ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది అనారోగ్య  పాలవుతున్నారు. ఇలాంటి ఆరోగ్యాలు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అసలే ఇప్పుడు కరోనా తో చాలా భయపడుతున్నారు. కరోనా రాకుండా ఉండడానికి కూడా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా తొందరగా సోకదు. కరోనా తగ్గింది లే అని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది.  అందుకే వైరస్ జ్వరాలు, కరోనా వంటివి రాకుండా ఉండడానికి ఒక నిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెరిగితే కరోనా వంటి వ్యాధులు దరిచేరవు. కాబట్టి రోగనిరోధక శక్తి పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 ప్రతిరోజు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె తీసుకొని నోట్లోకి పోసుకొని ఆయిల్ పుల్లింగ్ థెరపీ చేయడంవల్ల ఒక నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు.

 ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగడం వల్ల అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి. అలా కాకుండా గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి  చాలా మంచిది. అంతేకాకుండా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరంలో  పేరుకుపోయిన వ్యర్టాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో అనారోగ్యాలు మన దరిచేరవు.

 ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల ఇక ప్రశాంతత లభించడమే కాకుండా, ఆరోగ్యం కూడా బాగుంటుంది. శరీర అవయవాలపై ఒత్తిడి  పడకుండా మనసు  ప్రశాంతంగా ఉంటుంది.

 జీలకర్ర, ధనియాలు,  వెల్లుల్లి,పసుపు వీటన్నింటిని వంటల్లో కచ్చితంగా వాడుతుండాలి. వీటివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాలల్లో పసుపు పొడి కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి  చాలా మంచిది. అంతేకాకుండా రోగ  నిరోధక శక్తి పెరుగుతుంది.

 విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. టమోటా, బంగాళదుంప, ఆరంజి, నిమ్మ, కమల వంటి పండ్లను తీసుకోవడం వల్ల వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

 వంటింట్లో ఉండే వాటితో ను టీ చేసుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, వీటి తో టీ తయారు చేసుకొని అందులోకి  నిమ్మరసం కలిపి  రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

 గొంతు నొప్పితో బాధపడుతున్న వాళ్లు పుదీనా ఆకులు, వాము వాసన చూడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా లవంగాలు  పొడి చేసుకొని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

 జలుబుతో ఎక్కువ బాధపడుతున్నప్పుడు నువ్వుల నూనె, కొబ్బరి నూనె ముక్కు రంధ్రంలో ఈ రోజు ఉదయం సాయంత్రం పూయడం వల్ల జలుబు తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: