ఇదేమి టీ..? ఇప్పటివరకూ గ్రీన్ టీ,లెమన్ టీ, జింజర్ టీ ఇలా పలు రకాల టీ ల గురించి విన్నాము.. అలాగే రుచి కూడా చూశాము .. కానీ ఇప్పుడు ఏంటి సరికొత్తగా దానిమ్మతో టీ తాగారా అని అడుగుతున్నారు..? అవునండీ.. నిజమే దానిమ్మ టీ..ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టీలలో ఒకటి గా, అందులోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ దానిమ్మ టీ ని ఎర్రటి దానిమ్మ పండు లోని, ఎండిన పువ్వులు లేదా ఆకుపచ్చవి, అలాగే తెలుపు లేదా ఏదైనా మౌలిక టీ తో కలిపిన సాంద్రీకృత రసాయనాల నుండి ఈ టీ ని  తయారు చేస్తారు..


దానిమ్మ టీ లో యాంటీ ఆక్సిడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయాల్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంది. దానిమ్మ టీ ని  ప్రధానంగా దాని విత్తనాలు, తొక్క, అందులోని పొరల నుండి తయారు చేస్తారు. పండు తినదగిన భాగం 50 శాతం మాత్రమే ఉంటే ఇందులోని విత్తనాలను కప్పి ఉంచే పొర  40 శాతం ఉంటే పది శాతం విత్తనాలు ఉంటాయి. అయితే ఈ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. దానిమ్మ టీ లో ఆంథోసైనిన్స్, ఫినోలిక్ ఆమ్లాలతోపాటు ప్రధాన పాలీఫెనాల్స్ నిండి ఉన్నాయి. ఇవి కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడడానికి సహాయపడతుంది . మంచి పునరుత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దానిమ్మ గింజలు బీటా సిటో స్టెరాల్  పిండ రక్షణకు సహాయం చేస్తుంది.  అందులోనూ మహిళల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ను కూడా తగ్గిస్తుంది.


డయాబెటిస్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.  అలాగే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ నిరోధక లక్షణాలను  తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఆల్జీమర్స్ ను కూడా నిరోధించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.  అంతే కాకుండా ముఖం మీద ఏర్పడే మొటిమలు, ముడతలు కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. సూక్ష్మజీవులను నివారిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. అలాగే దంత సంరక్షణకు కూడా ఎంతో మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: