చిన్నారి కోసం ప్రపంచం మొత్తం ముందుకు కదిలింది. పాప ప్రాణాలను కాపాడటం కోసం దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ముందుకు వచ్చారు. ఎంతోమంది తమకు తోచిన విధంగా ఎవరికి వారు తమ వంతుగా సహాయం చేశారు. అలా చేస్తే గాని ఆ చిన్నారి బతికే అవకాశం లేదు. ఆ పాపకు ఒక చిన్న  ఇంజక్షన్ కావాలి. ఇంజెక్షన్ ఖరీదు దాదాపు 16 కోట్లు. అసలు ఆ చిన్నారికి ఏమయింది. ఇప్పుడు తెలుసుకుందాం.


 ఒక చిన్నారి కోసం ప్రపంచం కదిలి ముందుకు వచ్చి తమ వంతుగా సహాయం చేశారు. అలా సాయం చేయగా  వచ్చిన డబ్బుతో పాపను బతికించే ప్రయత్నం  చేస్తున్నారు. అసలు ఒక ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు ఉండటం విచిత్రంగా లేదు. ఆరు నెలల చిన్నారి తీరా కామత్ కి అరుదైన వెన్నెముక కండరాల వ్యాధి సోకింది. అది తగ్గాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జోల్ జెస్మా ఇంజక్షన్ ఇవ్వాలి.  ఈ ఇంజక్షన్ కొనడానికి  ఆ పాప తల్లిదండ్రులు సంపన్నులు ఏమి కాదు.


 ఎలాగైనా పాపను బతికించు కోవాలని క్రైడ్ ఫండింగ్ ద్వారా సహాయం చేయాల్సిందిగా కోరారు. ఇందుకోసం సోషల్ మీడియాలో తీరా ఫైట్స్ ఎస్ఎమ్ఏ పేరుతో అకౌంట్ తెరిచారు. అది చూసిన ప్రపంచం కదిలి వచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి  డొనేషన్లు వచ్చాయి. వచ్చిన డొనేషన్లు అన్నీ కలిపితే 16 కోట్ల వరకు పోగయ్యాయి. దాంతో ఇంజెక్షన్ ఇచ్చిన ముంబై హిందూజా హాస్పిటల్ డాక్టర్లు చిన్నారిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఇంజెక్షన్ వేసిన సందర్భంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు తమకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.


ఇది సాధ్యమైందంటే అది మీ వల్లే అని అన్నారు. ఫిబ్రవరి 26 ఉదయం పాపకు ఇంజక్షన్ ఇచ్చినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఇంజక్షన్ ఇచ్చారు గాని కచ్చితంగా వ్యాధి నయం అవుతుందంని డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వట్లేదు. తగ్గే అవకాశాలు ఉంటాయనే చెబుతున్నారు. ఇక్కడ మరో గొప్ప విషయం మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆ ఇంజక్షన్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇ విషయం కేంద్రానికి తెలిసింది.తీర కామత్ తల్లిదండ్రుల విజ్ఞప్తి తో ఇంజక్షన్ పై gst ఇంపోర్ట్ 6.5కోట్లను మాఫీ చేసారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: