దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి తిన్నా ఆహారం కల్తీ ఉన్నదా లేఖ మంచిదా అని అడిగితె ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దేశంలో ఆ తినే ఆహారాన్ని కలిసి చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. లాభాలనే లక్ష్యంగా చేసుకొని కొంతమంది వ్యాపారులు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. కల్తీ ఆహారాలను తినడం వల్ల కొందరు ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటే మరికొంతమంది ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కొంతమందికి కల్తీ చేయడం వ్యాపారం గా మారడంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.                                



 ఆహారం కల్తీ చేసేవారికి జీవిత ఖైదు విధించేలా మార్పులు చేసింది. మధ్యప్రదేశ్లో హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కేబినెట్ ఆహారంకల్తీ    చేసే వాళ్లకు జీవితఖైదు విధించిన చట్టాలలో మార్పు చేసిందని గతంలో దీనికి శిక్ష మూడేళ్లుగా ఉంది. కానీ ఇప్పుడు దానినే 14 సంవత్సరాలకు పొందుతున్నామని వెల్లడించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు  వ్యక్తమవుతున్నాయి.



 అదే సమయంలో మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో కానీ హోటల్స్ లో కానీ ఎక్స్పైరీ డేట్ అయిన వస్తువులను అమ్మ కూడదని, అలా అమ్మే వాళ్లకు శిక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపాలని రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేశారు.


 ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం కల్తీని క్షమించకూడదు అని ఆమె తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై కల్తీ ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు సైతం కల్తీ ఆహారం విషయంలో మధ్యప్రదేశ్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: