చాలామందికి నోరు  ఎంత శుభ్రం చేసుకున్న దుర్వాసన వస్తూ ఉంటుంది. నోరు దుర్వాసన పోవడానికి చాలా  ప్రయత్నాలు చేస్తుంటారు.  అయినా వాసన మాత్రం పోకుండా ఉంటుంది. అలాంటివాళ్లు స్పటిక బెల్లం తో  నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు.  అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...                                                                                               

 రోజు భోజనం చేసిన తర్వాత నోటిలో ఒక ముక్క స్పటిక బెల్లం పెట్టుకోవడం వల్ల దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా నోరు ఫ్రెష్ గా ఉండడమే కాకుండా, శ్వాస  తాజాగా ఉంటుంది.

 జ్వరం వచ్చినప్పుడు గొంతు నొప్పి, దగ్గు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొంచెం స్పటిక బెల్లం తీసుకొని చప్పరించడం వల్ల తొందరగా దగ్గు తగ్గుతుంది.

 వాతావరణ మార్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తాయి. గొంతు నొప్పిని నివారించుకోవడానికి కొద్దిగా స్పటిక బెల్లం, కొద్దిగా మిరియాల పొడి, నెయ్యిలో  కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

 స్పటిక బెల్లం, సోంపు గింజల తో కలిపి తీసుకోవడం వల్ల తిన్న  ఆహారం బాగా అరుగుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.

 భోజనం చేసిన తరువాత కొద్దిగా స్పటిక బెల్లం వేసుకోవడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బద్దకంగా ఉన్నప్పుడు కొద్దిగా స్పటిక బెల్లం తీసుకోవడం వల్ల బద్ధకం లేకుండా పోతుంది.

 స్పటిక బెల్లాన్ని కొంత గింజలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన మంచి ఎనర్జీని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: