మనము తాగే టీ లు అనేక రకాలుగా ఉన్నాయి. సాధారణంగా తీయగా ఉండే టీలు తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ వేపాకుతో చేసిన టీ మాత్రం చేదుగా ఉంటుంది. చేదుగా ఉందని తాగడానికి ఇష్టపడరు.  కానీ వేపాకు తో చేసిన టీ తాగడం వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. వేపాకు టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రక్త  హీనతతో బాధపడే వారికి వేపాకు టి మంచి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మనం చూద్దాం...                                                      

 వేపాకు టీ తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా ల నుంచి వచ్చే జబ్బుల నుండి బయటపడవచ్చు. అందుకే వేపాకు టీ తీసుకోవడం చాలా మంచిది.

 వేపాకు టీ తీసుకోవడం వల్ల జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

 10 వేపాకులను,బెల్లం కలిపి నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. గోరువెచ్చగా  ఉన్నప్పుడు నీటిని తాగడం వల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

 వేపాకుతో చేసిన టీ చాలా చేదుగా ఉంటుంది.  అయినా ఈ టీ తాగడం వల్ల షుగర్  లెవెల్స్ అదుపులో ఉంటాయి. అందుకే సుగర్ వ్యాధి ఉన్నవాళ్లు వేపాకు టీ తాగడం చాలా మంచిది.

 వేప నూనెను మొటిమలను పోగొట్టడానికి వాడుకోవచ్చు. మొటిమలు ఉన్నా ముఖానికి వేప  నూనె అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి.

 వేపాకులను తీసుకొని మెత్తగా దంచి దాని నుంచి రసం తీసుకోవాలి.  ఈ రసాన్ని తలకు పట్టించుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

 చర్మం ఎర్రబడటం, ఇంకా అనేక సమస్యలు ఉన్న వాళ్ళు వేప నూనె తీసుకొని చర్మంపై రాసుకోవడం వల్ల ఈ సమస్యలు తొందరగా తగ్గుతాయి

మరింత సమాచారం తెలుసుకోండి: