మనం రోజూ తినే కాయగూరల్లో పోషకాలు కలిగిన వాటిలో గోరుచిక్కుడు కూడా ఒకటి.. గోరుచిక్కుడు తినడానికి రుచికరంగా ఉండడమే కాకుండా, శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుందని  వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ గోరుచిక్కుడు తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


మెదడు పనితీరును మెరుగుపరిచేలా చేస్తుంది. ఇందులో ఉండే హైపో గ్లైసీమిక్ లక్షణాలు నరాల పనితీరును సమర్థవంతంగా ఉంచడంలో సహాయపడతాయి. తద్వారా  నరాల తిమ్మిర్లు, వాపులు, నొప్పులు వంటివి రాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇక జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. కడుపులో దాగి ఉన్న టాక్సిన్లను బయటకు పంపడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ గోరు చిక్కుడు..


ఇందులో ఉండే అధిక శాతం ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తసరఫరాకు ఉపయోగపడి, రక్తం  ఆక్సిజన్ ను మోసే సామర్థ్యాన్ని ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  అంతేకాకుండా గర్భవతుల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో అధిక మొత్తంలో ఉండే ఐరన్, క్యాల్షియం గర్భిణీ స్త్రీలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ ఆమ్లం పిండం అనేక జనన లోపాల నుండి అలాగే గర్భధారణ సంబంధిత ఆరోగ్య సమస్యల నుండి నిరోధిస్తుంది.


వీటిలో ఉండే విటమిన్ కె ఎముకలకు మంచిది. అలాగే పిండం అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో మొదటి పాత్ర వహిస్తుంది. ఇందులో ఉండే హైపో గ్లైసీమిక్,హైపోలిపిడమిక్ ల కారణంగా రక్తపోటుతో బాధపడుతున్నవారికి మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. వీటిలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ గోరుచిక్కుడు కాయ తినడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: