నిమ్మరసం మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కణాలను తగ్గిస్తుందని మనకు తెలుసు.. ఇక బెల్లం మన శరీరానికి కావలసిన ఐరన్ ను అందిస్తుంది అని కూడా మనకు తెలుసు.. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఏమౌతుందో మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మరసం లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ద్రవాలను ఎప్పుడూ సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అయితే ఒక అధ్యయనం ప్రకారం, నిమ్మరసంలో ఉండే  పాలీఫినాల్స్ అనబడే యాంటీఆక్సిడెంట్లు, బరువును తగ్గించడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయట. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇక దీంతో శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడే శక్తి మనకు వస్తుంది.


బెల్లం మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. మన శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపేలా చేస్తుంది. ఇక శరీర మెటబాలిజం పెంచి, అధిక కేలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. మరీ ఎక్కువగా అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ. అలాగే శ్వాసకోస వ్యవస్థ,జీర్ణవ్యవస్థలు శుభ్రం అవుతాయి.

ఇక నిమ్మరసం, బెల్లం ఈ రెండింటినీ కలిపి నిత్యం తీసుకుంటే అధిక బరువును జయించవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకూ అలాగే ఉంచి, ఆ తరువాత పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా ప్రతిరోజు పరగడుపున ఈ పానీయం సేవించడం వల్ల అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు.


మనలో చాలా మంది అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగక విసుగు చెంది ఉంటారు. కాబట్టి పైన చెప్పిన ఈ ఒక్క చిట్కా కేవలం పదంటే పది రోజులు మాత్రమే పాటించి, తేడాని మీరే గమనించవచ్చు. కాబట్టి ఈరోజు నుంచి వీలైతే ఈ పానీయాన్ని తాగడానికి ప్రయత్నించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: