సాధారణంగా ఎర్ర  టొమాటోలలో ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయని  మనకు తెలుసు. అంతేకాకుండా ఈ ఎర్రని టొమాటోలు ముఖ అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే.. అయితే పచ్చి టొమాటో ల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు నిపుణులు.. అయితే అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


విటమిన్ సి :
పచ్చి టొమాటో లతోపాటు ఎర్రటి టొమోటోలలో ముఖ్యంగా మనకు లభించే  పోషకం విటమిన్ సి. ఎర్రటి టొమోటోలతో  పోల్చితే పచ్చి టొమాటో లలో విటమిన్ సి తక్కువగా ఉన్నప్పటికీ,శరీరానికి అవసరమైన విటమిన్ నూ మాత్రం ఇవ్వగలవు. ఒక కప్పు పచ్చి టొమాటో లలో 42 మిల్లిగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. అలాగే సీజనల్ ఫ్లూ, జ్వరం,జలుబు వంటి అనారోగ్యాల ను సులభంగా ఎదుర్కోగలము . అంతేకాకుండా దంతాలు, చిగుళ్ళు,ఎముకలు, చర్మం మొదలైనవాటి ఆరోగ్యానికి విటమిన్ సి చాలా బాగా పనిచేస్తుంది..


 ఫైబర్ :
పచ్చి టొమాటో లలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే పేగు సంబంధిత సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. ఒక కప్పు పచ్చి టొమాటోలను రెండు గ్రాముల డైటరీ ఫైబర్ ను పొందవచ్చు. ఈ ఫైబర్ వలన గుండె జబ్బులు,పెద్దపేగు క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు.


బీటా కెరోటిన్ :
పచ్చి టొమాటో లలో  బీటాకెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. బీటా కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ ఉత్పత్తికి సహాయపడుతుంది విటమిన్ ఏ వల్ల  కళ్ళ ఆరోగ్యం కాపాడడానికి అలాగే తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు పచ్చి టొమాటో లలో  623 మైక్రోగ్రాముల బీటాకెరోటిన్ లభిస్తుంది.


 అంతేకాకుండా ఒక కప్పు పచ్చి టొమాటో లలో   23 మిల్లీగ్రాముల క్యాల్షియం, 367 మిల్లీ గ్రాముల పొటాషియం, ప్రోటీన్,మెగ్నీషియం, భాస్వరం,విటమిన్ కె కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: