భారతీయులకు వెల్లుల్లి  లేకుండా వంటలు చేయడం అసంపూర్తిగా ఉంటుంది. మన ఇండియాలో మసాలో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్నది. వెల్లుల్లి ఘాటయిన వాసన తో పాటు, చేదు రుచిని కలిగి ఉంటుంది. ఇందులో కాల్షియం ఐరన్ అయోడిన్ సల్ఫర్ వంటి ఎన్నో ఎసేన్షియల్ న్యూట్రియన్స్ ఉన్నాయి. ఇవన్నీ వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు దోహద పడతాయి. అలాగే ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం.


 వెల్లుల్లి ఉదయాన్నే తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్ ను తగ్గించే ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచుతాయి. వెల్లుల్లి చిల్డ్రన్ లో పేరుకుపోయిన క్రొవ్వు తగ్గిస్తుంది. రోజుకు ఒక వెల్లుల్లి తీసుకుంటే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి ఉత్పత్తిచేసే ఫైబ్రినోలైసిస్ లు గడ్డకట్టిన రక్తాన్ని సాధారణ స్థితికి తీసుకు వస్తాయి. వెల్లుల్లిలో ఉండే అజోయైన్ అనే మూలకం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. దీనివల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం దాదాపు తగ్గిపోతుందట.


 డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. దాని నివారణకు  వెల్లుల్లి తీసుకోవడం మంచిది. రోజూ వెల్లుల్లి తీసుకోవడం వల్ల మధుమేహ సంబంధిత వ్యాధులు పూర్తిగా తగ్గుతాయట. ఉదయాన్నే ఏమీ తినకుండా ముందుగా వెల్లుల్లి తింటే బాడీ మెటబాలిజం బాగుంటుంది. వెల్లుల్లి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.


 బ్రెయిన్ ని క్లీన్ చేయాలి అంటే వెల్లుల్లి  తినాలి. ఇవి మతిమరుపు కి దారితీసే అల్జీమర్ వ్యాధిని రాకుండా చేస్తాయి. అంతేకాకుండా బ్రెయిన్ చురుగ్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి రోజూ ఉదయం నిద్రలేవగానే నాలుగైదు వెల్లుల్లి పాయలను తినడం వల్ల బ్రహ్మాండమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది అంటున్నారు డాక్టర్లు. అంతేకాకుండా ఉబ్బసం జ్వరం కడుపులో నులిపురుగులు నివారణ వ్యాధులకు వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: