ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారు అంటే అధి కంటినిండా నిద్రపోయే వాళ్లే. ఉదయం లేచింది మొదలు అనేక ఒత్తిడులతో జీవనం గడిపేవారు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంటారు. ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి. తగినంత నిద్ర లేకపోతే  శారీరక మానసిక సమస్యలు తప్పవు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అవసరం.


 మంచి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు 8 గంటలు నిద్ర అవసరం. అలాగే ఎక్కువ సేపు నిద్ర పోవడం, ఎక్కువగా తినడం రెండు ఆరోగ్యానికి మంచివి కావు. నిద్ర తక్కువ అవడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు బాధిస్తాయి. మన అందరికీ నిద్ర ఎంత అవసరమో తెలుసు. అందుకనే మనం తగినంత నిద్ర పోవడానికి వీలున్నంత వరకు ట్రై చేస్తాం. ఈ రోజు ఏ టైం కి లేవాలి డిసైడ్ చేసుకొని ఆ టైమ్ కీ అలారం పెట్టుకోండి. అలాగే నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోకండి.


 ఆల్కహాల్ తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది కానీ మళ్ళీ త్వరగా మెలుకువ  కూడా వచ్చేస్తుంది. దీనివల్ల తర్వాత సరిగ్గా నిద్ర పట్టదు. రాత్రి నిద్రకు ముందు చక్కని క్లీన్ సాక్స్ వేసుకుని పడుకుంటే త్వరగా నిద్ర పడుతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. మీ బెడ్ రూమ్ చీకటిగా ఉండేటట్లు చూసుకోండి. అలా కుదరదు అనుకుంటే మీకు సౌకర్యంగా ఉండే విధంగా ఐ మాస్క్ వేసుకుని పడుకోండి. మీ బెడ్ రూమ్ టెంపరేచర్ మరీ ఎక్కువగా ఉండకూడదు మరీ తక్కువగా ఉండకూడదు చల్లగా ఉండేలా చూసుకుంటే చాలు.


 నిద్రకి కనీసం గంట ముందు కంప్యూటర్ టీవీ మొబైల్ చూడడం ఆపి వేయండి. రోజు కనీసం కొద్ది సేపైనా వ్యాయామం చేస్తే చక్కగా నిద్రపడుతుంది అని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అయితే నిద్రకు రెండు, మూడు గంటల ముందు వ్యాయామం అయిపోవాలి. బెడ్ రూమ్ లో ఎంత నిశ్శబ్దంగా ఉంటే ఎంత హాయిగా నిద్ర పడుతుంది. నిద్రపోయే ముందు ఇలాంటి ఆలోచనలు చేయకుండా నిద్ర పోవాలి. ఇలాంటప్పుడు ధ్యానం చేయడం చాలా మంచిది. ధ్యానం ప్రేయర్ వంటివి  మెదడు నీ శరీరాన్ని నిద్రకు రెడీ చేస్తాయి. నిద్రపోయే ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర బాగా వస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: