ప్రతి ఒక్క విటమిన్ మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే మనం తినే కాయగూరల్లో,పప్పు దినుసులలో ఈ విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. విటమిన్స్ లోపం వల్ల ఎన్నో అనర్ధాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ. మరీ ముఖ్యంగా విటమిన్ బి 12 గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మన శరీరం లో ఎర్ర రక్త కణాల వృద్ధికి విటమిన్ బి 12 చాలా ముఖ్యం. అంతేకాకుండా నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా కూడా ఈ విటమిన్ బి 12 చాలా అవసరం. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా చాలామంది విటమిన్ బి 12 లోపంతో బాధపడుతున్నారు. అయితే ఈ లోపాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అవి ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం..

విటమిన్ బి 12  ముఖ్యంగా ఎవరెవరిలో తక్కువగా ఉంటుంది అంటే...మాంసాహారం తినని వారిలో, మద్యపానం, ధూమపానం సేవించే వారిలో, డయాబెటిస్, అసిడిటీ అలాగే దీర్ఘకాలంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్న వారిలో ఈ విటమిన్ బి12 లోపం కనిపిస్తుంది. ఈ విటమిన్ బి 12 లోపం వల్ల నీరసం,అలసట, మలబద్ధకం,  కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు రావడం,  అలాగే జ్ఞాపకశక్తి కోల్పోవడం, జీర్ణాశయం, మూత్రాశయ సమస్యలు రావడం జరుగుతుంది..


 మీలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాంసాహారం అయిన చికెన్, మటన్,ఫిష్ లలో ఈ విటమిన్ బి12  పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా ఈ విటమిన్ల లోపాన్ని సరి చేసుకోవచ్చు. ఇక శాకాహారులైతే పాలు, బాదం పప్పు, వెన్న  అలాగే కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ ఉండటం వల్ల కూడా ఈ విటమిన్ల లోపాన్ని సరి చేయవచ్చు. అలాగే మద్యం సేవించడం పూర్తిగా మానివేయాలి. ధూమపానం కూడా చేయకూడదు.. చూశారు కదా..!  ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో..ఇలా చేస్తే మీ లో విటమిన్ బి 12 లోపం లేకుండా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: