ఉప్పు లేని కూడు చెత్త కుప్ప వంటిది..పాత సామెత. ఉప్పు ఉన్న కూడు చెత్త కుప్ప లాంటిది ఇదే కొత్త సామెత. ఎందుకంటే ఉప్పు ఎన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు తినడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది. బీపీ పెరిగితే అనేక   అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఉప్పు ఎంత తక్కువ చేస్తే అంత మంచిందని వైద్యులు చెబుతున్నారు. ఒకసారి రుచికి అలవాటు పడ్డాక మానేయడం అంటే కష్టమే కానీ ఇలాంటి టిప్స్ ఉపయోగించి ఉప్పు వాడకాన్ని తక్కువ చేసుకోండి. ముఖ్యంగా ఉప్పుకు బదులుగా ఏ పదార్థాలు వాడితే ఆహారం రుచి ఉంటుందో తెలుసుకోవాలి. ఉప్పుకు బదులుగా ఆహారంలో ఆమ్ చూర్, నీమ్ పౌడర్, లెమన్ పౌడర్, మిరియాలపొడి, ఒరె గానో వంటివి ఉపయోగించాలి. వంట చేసేటప్పుడు మొదట్లో ఉప్పు వేసుకుంటే ఎక్కువ ఉప్పును ఆహారం పీల్చుకుంటుంది. కాబట్టి చివర్లో ఉప్పువేయాలి. అలా వేస్తే తక్కువ ఉప్పు ను ఆహారం పీల్చుకుంటుంది. వంట చేశాక దానిపై కొంత నిమ్మ రసం పిండితే టేస్టీగా ఉంటుంది.

దాంతో ఉప్పు లేని కొరత తగ్గిపోతుంది. ఆహారం రుచి రావాలంటే మంచి వాసన ఉండాలి. కాబట్టి వాసన కోసం ఆహారంలో పుదీనా, కొత్తి మీర ను వేసుకుంటే ఉప్పులేని ఫీలింగ్ పెద్దగా ఉండదు. రెస్టారెంట్ లకు వెళ్ళినప్పుడు తక్కువ ఉప్పు ఉండే ఆహారాన్ని ప్రిఫర్ చేసుకోవాలి. అంతే కాకుండా బిర్యానీ లాంటివి తినేటప్పుడు బిర్యానీ సూప్ కాకుండా అప్పుడే చేసిన ఫ్రెష్ వెజిటబుల్ సూప్ లను వాడాలి. దాంతో ఉప్పును తగ్గించుకోవచ్చు. ఉరగాయలు, సాస్, చిప్స్, అప్పడాలు, వడియాలు వంటివి తినడం తగ్గిస్తే మంచింది. వాటిలో ఎక్కువ ఉప్పు ఉంటుంది. అయితే ఇవి ఇష్టపడే వారు తక్కువ ఉప్పు వేసుకుని ఇంట్లోనే వడియాలు చేసుకుంటే బెటర్..ఉప్పు శాతం తక్కువ ఉంటుంది..అలాగే ఫ్రెష్ గా కూడా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: