పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. ప్రత్యేకమైన సువాసన... మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకు సొంతం. గ్రీన్ చట్ని తయారీలో, బిర్యానిలో తప్ప దీనికి మరేం ప్రయోజనాలుంటాయి అనుకోవచ్చు. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలూ పుష్కలమే! చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.                                                   

 పుదీనా వల్ల నోరు ఫ్రెష్ గా అవుతుంది, బాడీ చల్లబడుతుంది. అందుకే రిఫ్రెషింగ్ డ్రింక్స్ లో పుదీనా కూడా ఉంటుంది. పుదీనా ని ఇంటి పెరట్లో ఈజీగా పెంచుకోవచ్చు, లేదా బాల్కనీలో కుండీలో కూడా పెంచుకోవచ్చు. చూడగానే కంటికి ఆహ్లాదంగా, దగ్గరకి వెళ్తే కొద్దిగా ఘాటైన పరిమళంతో ఉండే ఈ పుదీనా యొక్క ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దాం.

పుదీనా లో మెంథాల్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఇది ముక్కు దిబ్బడని తగ్గిస్తుంది.పుదీనా ఇరిటేట్ అయి ఉన్న పొట్టని చల్లబరుస్తుంది. స్టమక్ అప్సెట్ కి ఇది మంచి చిట్కా. సరిగ్గా అరగాక పోవడం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోం, కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వంటి వాటి నుండి రిలీఫ్ ని ఇస్తుంది.

పుదీనా లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ అలర్జిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. రెగ్యులర్ గా పుదీనా తీసుకోవడం వల్ల, ప్రత్యేకించి శీతా కాలం లో, ఆస్త్మా పేషెంట్స్ కి రిలీఫ్ గా ఉంటుంది. ఎయిర్‌వే లో ఉండే కంజెషన్ ని తొలగించి తేలికగా ఊపిరి తీసుకోగలిగేలా చేస్తుంది.పొద్దున్నే పుదీనా ని వాసన చూసినా, నాలుగైదు ఆకులు నోట్లో వేసుకుని నమిలినా వికారం తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: