అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే, దీన్ని తినేందుకు చాలామంది ఇష్టపడరు. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. మరి అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ  ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.                



మనం నిత్యం వంటకాల్లో వాడే అల్లం పురాతన సుగంధాల్లో ఒకటనే సంగతి తెలిసిందే. చిన్న వేరుముక్క నుంచి తయారయ్యే అల్లం మంచి ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. అల్లం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చైనా దేశంలో అనేక రోగాలకు చెక్ పెట్టేందుకు అల్లంను ఔషధాల తయారీలో అక్కడి శాస్త్రవేత్తలు వినియోగిస్తున్నారు. కూరలు, పచ్చళ్లలో మనం అల్లంను ఎక్కువగా వినియోగిస్తాం.


అల్లం వంటకల్లో వినియోగించడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు నోటి దుర్వాసన పోతుంది. చాలామంది ప్రయాణాల్లో వాంతులతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్లు అల్లంతో చేసిన టీ తాగితే ఆ సమస్య దూరమవుతుంది. వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగలో అల్లం కలిపి తీసుకుంటే మంచిది. అల్లం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.


అల్లం రక్తనాళాల్లో రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంతో పాటు ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు అల్లంతో చేసిన వంటకాలు తీసుకుంటే ఆ సమస్యలు దూరమవుతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలకు అల్లం సులువుగా చెక్ పెడుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసే అల్లం రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: