మన దైనందిన జీవితంలో చపాతీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ద, బరువు మీద ఏకాగ్రతతో ఈ మద్యకాలంలో చపాతి తినేవారి సంఖ్య ఎక్కువైపోతున్నది. అయితే ఈ చపాతీ ఎందుకు తింటున్నారో, దీని వల్ల పొందే ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు. గోధుముల్లో చెప్పలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది కార్డియో వాస్యులార్ వ్యాధులను గ్రేట్ గా తగ్గిస్తుంది . అంతే కాదు ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది.                                                                     

గోధుమలు లేదా గోధుమపిండిలో విటమిన్ బి&ఇ, కాపర్, ఐయోడిన్, జింక్, మ్యాంగనీస్, సిలికాన్, ఆర్సెనిక్, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్సియం మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి.ఈ హై న్యూట్రీషియన్ విలువల వల్ల, కొన్న ప్రత్యేకమైన సమస్యలు, ఊబకాయం, ఆస్తేథియా మినిరల్ లోపం, అనీమియా, బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూబర్ క్లోసిస్, మరియు ఇతర గర్భధారణ సమస్యను నివారించుకోవచ్చు . అందుకే చపాతీలను ఎక్కువగా రెగ్యులర్ డైట్ లో చేర్చుతుంటారు.


 త్రుణ ధాన్యాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు చపాతీలను ఎక్కువగా తింటుంటారు. గోధుమలు గ్లిజమిక్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది . మరియు ఎవరైతే బరువు తగ్గించుకోవాలని కోరుకుంటున్నారో, అలాంటి వారు కూడా చపాతీలను రెగ్యులర్ డైట్ లో తీసుకోవాలి. చాలా తక్కువ క్యాలరీలు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.డయాబెటిక్ పేషెంట్స్ రైస్, గోధుమ పిండి తో చేసిన చపాతీ తినడం అంత ఆరోగ్యకరం కాదు, ఎందుకంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. చపాతీల మీద నెయ్యి రాయడం, అన్నం లో నెయ్యి కలుపుకోవడం వల్ల వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది, తేలికగా అరుగుతాయి కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: