కొందరు టెన్షన్‌లో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు. మరికొందరు ఆనందంలో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతూ కనిపిస్తారు. ఇంకొందరు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటే చాలు గోళ్లు కొరికేస్తారు. ఈ అలవాటు మంచిదికాదని పెద్దలు చెప్పడం మనం చూస్తూనే ఉంటాం. గోళ్ల కొరకడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ఈ అలవాటు ఎక్కువగా బాల్యంలో ఉంటుంది. క్రమేణా పెద్దయినా కూడా కొందరు ఈ అలవాటు మానలేరు. వైద్య పరిభాషలో ఈ అలవాటును ఒనికోఫాగియా అంటారు.  గోళ్లు కొరికే అలవాటును ఎలా ఏర్పడుతుందో చెప్పేందుకు ఒక కారణమంటూ లేదు. కానీ, కొందరికి వారు ఫేస్ చేసే రోజువారి పరిస్థితుల వల్ల ఈ అలవాటు వస్తుంది. ఒంటరిగా ఉన్నా, ఫ్రస్ట్రేషన్‌కు గురైనా కొంతమంది గోళ్లను కొరుకుతుంటారు.


గోళ్లు కొరికే అలవాటును ఎలా ఏర్పడుతుందో చెప్పేందుకు తగిన కారణాలు లేవు. కానీ కొందరికి వారు ఎదుర్కొనే పరిస్థితుల వల్ల ఈ అలవాటు వస్తుంది. బాగా బోరింగ్‌గా ఫీలైనా, ఫ్రస్ట్రేషన్‌కు గురైనా కొంతమంది గోళ్లను కొరుకుతుంటారు. గోళ్లు కొరకడాన్ని వారు ఉపశమనంగా భావిస్తారు. అది వాళ్లను బిజీగా ఉంచుతుంది. మీరు ఏకాగ్రతతో పనిచేస్తున్నప్పుడు.మీకు తెలియకుండానే గోళ్లను కొరికేస్తారు. అయితే ఈ అలవాటు మానుకోవాలి అంటే ఏం చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం.


గోళ్లను కొరకడం చెడు అలవాటే కాదు, అనారోగ్యం కూడా. దీనివల్ల వేళ్లచివరి చర్మం దెబ్బతినడమే కాకుండా కణజాలం దెబ్బతింటుంది. ఈ సమస్య ఏర్పడినప్పుడు గోళ్ల చుట్టూ పుండ్లు ఏర్పడతాయి. గోళ్లు అసాధారణంగా కనిపిస్తాయి. ఆరోగ్యకరమైన వ్యక్తికి ఉండే గోళ్లతో పోల్చితే ఆ అలవాటు ఉండే వ్యక్తులు ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురవ్వుతారు. ఎందుకంటే గోళ్లల్లో ఉండే బ్యాక్టీరియా వేళ్ల ద్వారా నోటిలోకి చేరుతుంది. చేతి వేళ్లను నోట్లో పెట్టుకోవడం, కొరకడం వంటి అలవాట్ల వల్ల కడుపు, పేగు ఇన్ఫెక్షన్లు ఏర్పడవచ్చు.


మీ గోళ్లను ఎప్పుడు శుభ్రంగా, అందంగా కనిపించేలా చూసుకోవాలి. గోళ్లను కొరకు కూడదనే సంకల్పాన్ని మనసులో బలంగా పెట్టుకోవాలి.గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకోవడం ద్వారా ఈ అలవాటును కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే చాలావరకు నెయిల్ పాలిష్‌ల రుచి చేదుగా ఉంటుంది. కాబట్టి ఆ గోళ్లను నోట్లో పెట్టుకుంటే ఆ రుచి వల్ల వెంటనే అప్రమత్తం అవుతారు.గోళ్లు కొరికే అలవాటు మరీ ఎక్కువగా ఉంటే చేతికి నిత్యం గ్లవ్స్ ధరించండి.ఏ కారణం వల్ల మీకు గోళ్లు కొరికే అలవాటు వచ్చిందనే విషయాన్ని తెలుసుకుని, జాగ్రత్తపడండి.ఒత్తిడి వల్లే మీరు గోళ్లు కొరుకుతున్నట్లయితే చూయింగ్ గమ్ నమలడం, స్ట్రెస్ బాల్ ప్రెస్ చేయడం, ఫిడ్గెట్ మ్యాగ్నెట్ సాయంతో అలవాటును మానుకోవచ్చు.ఈ అలవాటును మీరు వెంటనే మానుకోలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: