వేసవి కాలం వచ్చేస్తుంది. ఇంకా ఎండా వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో చెమట రూపంలో శరీరంలో ఉండే లవణాలు అన్ని బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల నీరసంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఎక్కువ  నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవికాలంలో నీళ్లు  ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. నీటితోపాటు కొన్ని రకాల పండ్ల రసాలు తీసుకోవడం వల్ల శరీరం శక్తిని కోల్పోకుండా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో దొరికే పండ్లు పుచ్చకాయ, నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. కూల్డ్రింక్స్ కంటే ఈ పండ్ల రసాలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు. రసాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 పండ్ల రసాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి పండ్ల  రసాలను తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా మూత్రంలో మంట తగ్గించడమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఈ పండ్ల రసాలు కాపాడతాయి.

 వేసవిలో రసాలను తీసుకోవడం వల్ల చర్మానికి కొత్త యవ్వనం వచ్చేటట్లు చేస్తాయి. పేగుల్లో మలినాలను బయటకు పంపే టట్లు చేస్తాయి.  అంతే కాకుండా ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.

 నిమ్మకాయ, పచ్చి మామిడి జ్యూస్ లలో పొటాషియం, విటమిన్ బి 1, విటమిన్ 2, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్ల జ్యూస్ తాగడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.

 బరువు తగ్గడానికి పండ్ల రసాలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా శరీరం లో నీటి శాతం పెరిగే ఎందుకు పండ్ల  రసాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరానికి  కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి.

 గుండె సమస్యలు తీర్చడానికి పండ్ల రసాలు ఎంతో దోహదపడతాయి. అంతేకాకుండా డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి.

 వేసవిలో పళ్లరసాలను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కూల్ డ్రింక్స్ తీసుకోకుండా, పళ్లరసాలను తీసుకోవడం ఎంతో మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: