వేసవికాలంలో కొన్ని రకాల కూరగాయలు తింటే లో వేడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. అలాంటి వాటిలో పొట్లకాయ ఒకటి. పొట్ల కాయ తినడం వల్ల శరీరం పొడిబారకుండా ఉంటుంది.  అంతేకాక శరీరాన్ని చల్లబరుస్తుంది. కానీ పట్టాయి తినడానికి చాలా మంది ఇష్టపడరు. అందులో ఉండే పోషక విలువలు తెలిస్తే, పొట్లకాయ  ను వదలకుండా తింటారు. వేసవికాలంలో పొట్ల కాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 పొట్ల కాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది.  అలాగే క్యాలరీలు  లో అతి తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కాయలు తినడం వల్ల కచ్చితంగా  తగ్గుతారు. అంతేకాకుండా ప్రోటీన్లు, విటమిన్ ఏ బి సి లు కూడా ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం,  ఐరన్ అధికంగా ఉంటాయి. అందుకే ఆహారంలో భాగంగా పొట్లకాయ నీ చేసుకోవడం మంచిది.

 టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు పొట్లకాయ తీసుకోవడం చాలా మంచిది. అలాగే జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు పొట్లకాయ ఉడికించిన నీళ్లు తాగడం వల్ల త్వరగా జ్వరం తగ్గుతుంది. అంతేకాకుండా అనేక రోగాలను నయం చేస్తుంది.

 ముఖ్యంగా ఎండాకాలంలో పొట్లకాయ తీసుకోవడం వల్ల శరీరం  చల్లబడుతుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మంచి టానిక్లా పనిచేస్తుంది. పొట్లకాయ ఆకుల్ని ప్రాకృతిక వైద్యంలో వాడతారు. అంతేకాకుండా మేక అనారోగ్యాలను దరిచేరకుండా చేస్తుంది.

 పొట్లకాయ లో అధిక నీటి శాతం ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరణ చేస్తుంది. పొట్ల కాయలో ఉండే  ధాతువులు, విటమిన్లు, కెరోటిన్లు, చర్మ రోగాలు రాకుండా చేస్తాయి. అంతేకాకుండా చుండ్రు తొలగించడానికి కూడా పొట్లకాయ బాగా ఉపయోగపడుతుంది.

 పొట్లకాయ రసము,  కొత్తిమీర రసం బాగా మరిగించి కాషాయం గా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని మూడు పూటలా ఒక స్పూన్ చొప్పున తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. పొట్లకాయ ఆకులకు వాంతులు తగ్గించే శక్తి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: