చర్మము ఉన్న వాళ్ళు చాలా బాధ పడుతూ ఉంటారు. పొడి చర్మాన్ని పోగొట్టుకోవడానికి అనేక క్రిములు వాడుతూ ఉంటారు. అంతేకాకుండా పార్లర్లకు వెళ్తుంటారు అయినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. అందుకే ఇంట్లో ఉండే వాటితోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పొడిచర్మం లేకుండా చేయడానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి. ఈ చిట్కాలు ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

 పొడిచర్మం తో బాధపడుతున్న వాళ్లు చర్మాన్ని శుభ్రం చేసేటప్పుడు పాలల్లో వెజిటబుల్ ఆయిల్ కలిపి కాటన్ తీసుకొని చర్మానికి  రాయాలి. ఇలా చేయడం వల్ల పొడిచర్మం పోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

 ఆరెంజ్ జ్యూస్ తీసుకుని అందులో తేనె కలిపి ముఖానికి బాగా మసాజ్ చేయాలి. 20  నిమిషాల తర్వాత చల్లని నీటితో బాగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.

 పొడిబారిన మొఖం మృదువుగా మారాలంటే, పెరుగు,  పసుపు, తేన మూడింటిని  బాగా కలిపి ముఖానికి బాగా అప్లై చేసి 20 నిమిషాల సేపు అలానే ఉండనివ్వండి. తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

 పొడి చర్మం కలవారు తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి ముఖానికి  పట్టించి నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిచర్మం పోతుంది. అలాగే ముఖానికి గుడ్డులోని తెల్లసొనను అప్లై చేయడం వల్ల కూడా పొడిచర్మం ఉండదు.

 అరటిపండు, ఆపిల్, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్,  తేనె కలిపిన మిశ్రమంతో బాడీ అంతా మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.

 కాళ్లు చేతులు పగిలినట్లు ఉంటే గ్లిజరిన్ లో రోజ్ వాటర్, తేనే కలిపి రోజు ఉదయం సాయంత్రం కాళ్లు చేతులకు బాగా పట్టించాలి. కొద్దిసేపు తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: