క్యాల్షియం మన శరీరానికి ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. క్యాల్షియం మన ఎముకల దృఢత్వానికి, పళ్ళు పటిష్టంగా ఉండాలంటే   క్యాల్షియం ఎంతో అవసరం అవుతుంది.. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాల్షియం ను పొందవచ్చు.. మనలో చాలామంది కాల్షియం లోపం తో బాధపడుతూ ఉంటారు..  ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి, సప్లిమెంట్లను తీసుకొని, వారు చెప్పినట్లుగా టాబ్లెట్లను వాడితూ, కాల్షియం కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. తద్వారా మన శరీరంలో క్యాల్షియం పునరుత్పత్తి జరుగుతుంది..


కానీ మరి కొంతమంది అవసరం ఉన్నా.. లేకున్నా. కాల్షియం కలిగిన ఆహారాన్ని  వదిలేసి క్యాల్షియం టాబ్లెట్ లను వాడుతుంటారు. ఈ టాబ్లెట్ లు ఆరోగ్యానికి  చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. నిజమే కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక నష్టాలు జరుగుతాయి.. సగటు ఆరోగ్యవంతమైన పురుషునికి రోజుకు 1000 నుంచి 1200 మిల్లీ గ్రాముల మోతాదులో కాల్షియం అవసరం ఉంటుంది. స్త్రీలకు అయితే రోజుకు 1200 నుంచి 1500 మిల్లీగ్రాముల కాల్షియం అవసరమవుతుంది. ఇక పిల్లలకు 1300 నుంచి 2500 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం. కాబట్టి అంతే మోతాదులో మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉండేలా చూసుకోవాలి.


ఒకవేళ అంత కన్నా ఎక్కువ క్యాల్షియం తీసుకున్నట్లయితే  కిడ్నీలు ఆ కాల్షియం కలిగిన ఆహార పదార్థాలను ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా కిడ్నీలలో రాళ్ళు ఏర్పడతాయి. అలాగే బీ పీ రావడం,  ఎముకలు దృఢంగా మారకపోగా పెళుసుగా అవుతాయి. అంతేకాకుండా మెదడు పనితీరు కూడా దెబ్బ తింటుంది.. ఇక ఎముకలు పెళుసుగా మారడం అంటే  తొందరగా విరిగే అవకాశాలు కూడా ఎక్కువ.


కాబట్టి ఎవరికి ఎంత అవసరమో, అంతే మోతాదులో క్యాల్షియం ను తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా క్యాల్షియం కావాలనుకునేవారు టాబ్లెట్లను నియంత్రించి, కాల్షియం కలిగిన ఆహారాలు తీసుకోవాలని కూడా వారు చెబుతున్నారు. వీలైనంత వరకూ కాల్షియంను తగిన మోతాదులో తీసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం..

మరింత సమాచారం తెలుసుకోండి: