ప్రతి విటమిన్ ను,  పోషకాలను అందించే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ రుచికి పుల్లగా ఉన్నప్పటికీ, దీనిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వీటిలో పోషకాలు, యాంటీ - ఆక్సిడెంట్లు, ఎంజైములు, ఇతర సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే ఈ పైనాపిల్ ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..


ఒక కప్పు పైనాపిల్ ముక్కల ద్వారా మనకు  82 కేలరీల శక్తి లభిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి 6, మ్యాంగనీస్, కాపర్,  ఫోలేట్,మెగ్నీషియం, పొటాషియం, నియాసిన్, పాంటో థెనిక్ యాసిడ్, రైబో ఫ్లేవిన్,ఐరన్ లు సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఫ్రీరాడికల్స్ బారినుంచి మన శరీరాన్ని రక్షించుకోవచ్చు. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


పైనాపిల్లో బ్రోమెలెయిన్ అనబడే సమ్మేళనం ఉండడం వల్ల తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. పైనాపిల్ పండ్లను తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు స్థాయి పెరుగుతుంది. ఫలితంగా వ్యాధులు,ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మన శరీరంలో చేరే సూక్ష్మక్రిములను ఎప్పటికప్పుడు నాశనం చేస్తాయి.


ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు పైనాపిల్ పండ్లను తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వీటికి కారణం. శ్రస్థ చికిత్స అయిన వారు కూడా పైనాపిల్ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. అంతేకాకుండా పైనాపిల్ పండ్లను తినడం వల్ల నోటి దుర్వాసనను కూడా అరికట్టవచ్చు. వీటిలో విటమిన్ సి ఉండడం కారణంగా రోగనిరోధక శక్తి పెరిగి, ప్రస్తుతం కరోనా బారిన పడకుండా ఉండగలం.. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు కలిగిన పైనాపిల్ పండ్లను అప్పుడప్పుడూ ఆహారంగా తీసుకుంటూ ఉండాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: