సహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్ధకం గా భావించాలి. సాధారణంగా మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండా ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది.వారానికి మూడుసార్లకంటే తక్కువగా మల విసర్జన జరిగినా, మల విసర్జనకి ఇబ్బంది పడుతున్నా, ముక్కవలసి వస్తున్నా, మలం గట్టిగా ఉన్నా దాన్ని కాన్స్టిపేషన్ అనే అనవచ్చు.


మలబద్ధకానికి చాలా కారణాలే ఉంటాయి. మల బద్ధకానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లనే చెబుతారు నిపుణులు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోకపోవడం, ఆహారంలో ఫైబర్ చాలా తక్కువగా ఉండడం వంటివి ఈ సమస్యకి దారి తీస్తాయి. ఈ మల బద్ధకం సమస్యని పట్టించుకోక అది దీర్ఘ కాలిక సమస్య గా మారితే ఒక్కోసారి సర్జరీ కూడా అవసరపడవచ్చు. మీరు చేయవలసిన ముఖ్యమైన పని కాన్స్టిపేషన్ సమస్యకి దారి తీయని ఫుడ్స్ తీసుకోవడం.


ఇక్కడ మీరు చేయవలసిన, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి, చూడండి. రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. మీతో పాటూ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళడం, మీ వర్క్ ప్లేస్ లో మీకు కనిపించే విధంగా వాటర్ బాటిల్ పెట్టుకోవడం, ఇంట్లో మీ డైనింగ్ టేబుల్ మీదా, మీ బెడ్ సైడ్ టేబుల్ మీదా వాటర్ ఉంచుకోవడం వల్ల మీరు మీకు తెలియకుండానే నీరు తాగుతారు. నీటితో పాటు, నిమ్మ రసం కలిపిన నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటివి కూడా తీసుకోవచ్చు. ఇలా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మలం మెత్తబడి మీకు మలవిసర్జన సులభంగా జరిగిపోతుంది.కేవలం పాలు, పాల పదార్ధములు మాత్రమే మల బద్ధకానికి కారణం కాకపోవచ్చు. కానీ వీటిలో ఉన్న లాక్టోజ్ మీకు ఇప్పటికే ఉన్న అసౌకర్యాన్ని పెంచుతుంది.



అలాగే, చీజ్ ఎక్కువ ఉన్న ఆహార పదార్ధాలు సమతులాహారం లోకి రావు. అందుకనే, లో ఫ్యాట్ మిల్క్, యోగర్ట్ తప్ప మిగిలిన వాటిని తీసుకోకుండా ఉండడం అవసరం.కెఫీన్ లాగానే ఆల్కహాల్ కూడా డీ హైడ్రేషన్ కి దారి తీస్తుంది. అందుకని తప్పని సరిగా ఆల్కహాల్ కి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.వీటితో పాటు మీరు కొన్ని లైఫ్ స్టైల్ మార్పులు కూడా చేసుకోవడం అవసరం. అవేమిటో తెలుసుకోండి. మీ బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ప్రతి రోజూ ఒకే సమయానికి తీసుకునే అలవాటు చేసుకోవడం అన్నింటి కన్నా ముఖ్యమైనది.మీరు నిద్ర లేచీ లేవగానే ఒక గ్లాసు నీరు తాగండి

మరింత సమాచారం తెలుసుకోండి: