కొందరు పక్కన కూర్చుంటే చాలు ఏదో తెలియని దుర్వాసన వస్తుంది. ఒక్కో శరీరానికి ఒక్కో విధమైన దుర్వాసన ఉంటుందని తెలుసు . ఇక ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది. దానికి తగిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం  ముఖ్యంగా శరీరం నుండి దుర్వాసన రావడానికి గల కారణాల్లో వారి ఆహారపు అలవాట్లేనని వైద్య నిపుణులు చెబుతుంటారు. కొందరు వ్యక్తులు అధికమొత్తంలో మసాలాలతో కూడిన ఆహార పదార్ధాలు తీసుకోవడం వలన శరీరంలో సల్ఫర్ ఉత్పన్నమవుతుంది. అది చర్మ రంద్రాల ద్వారా బయటకు పంపబడుతుంది.ఈ క్రమంలో శరీరం దుర్వాసన రావడానికి అవకాశముంది.

చలికాలం పోయి వేసవి సమీపిస్తోంది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఉక్కపోత మొదలైంది. ఫలితంగా చెమట కూడా విపరీతంగా పడుతోంది. దీంతో శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఆడా, మగా,చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ సమస్య వేదిస్తుంది. ముఖ్యంగా స్కూళ్లు, ఆఫీసులు, జనాల మధ్య పనిచేసేవారికి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. దుర్వాసన నివారణకు సెంట్ కొట్టుకుంటే సరిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ, అది తాత్కాలిక మాత్రమే. శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుకుంటే ఆ సమస్యే ఉండదు. అందుకు ఈ కింది చిట్కాలను పాటించడం ఈ రోజు నుంచే మొదలుపెట్టండి.


అలాగే ఎరుపు రంగు వుండే ఆహార పదార్ధం తిన్నప్పుడు అది జీర్ణమవడానికి ఎక్కువ శక్తీ కావలసి వస్తుంది. ఈ సమయంలో శరీరం నుంచి చెమట అధిక మొత్తంలో విసర్జింపబడుతుంది. దాంతో శరీరం నుండి దుర్వాసన వస్తుంది. అలాగే కొందరు అధిక మొత్తంలో ఆల్కహాల్ సేవిస్తుంటారు. దీనివలన కూడా చెమట ఎక్కువగా వస్తుంది. అది దుర్వాసనకు దారితీస్తుంది.
చలికాలంలో చాలామందికి స్నానం చేసే అలవాటే ఉండదు. కానీ, వేసవిలో స్నానం తప్పనిసరి. టైమ్ లేదని వాయిదా వేయొద్దు.స్నానం మన శరీరానికి వ్యాక్సినేషన్ వంటిది. బ్యాక్టిరియాను దూరంగా ఉంచుతుంది.


శరీర దుర్వాసన సమస్య ఎక్కువగా ఉన్నవారు రోజుకి రెండు సార్లు స్నానం చేస్తే ఆరోగ్యానికి, పక్కవాళ్లకు కూడా మంచిది.శరీర దుర్వాసన నివారణకు అతిగా సెంట్లు లేదా డియోడరెంట్లు వాడితే చర్మ సమస్యలు తలెత్తవచ్చు. ఎప్పుడూ కూడా ఎక్కువశాతం నీళ్లతో తయారైన డియోలను వాడడమే ఉత్తమం.చెమట మీద సెంట్ అస్సలు కొట్టకండి. ఇది శరీర దుర్వాసను పెంచుతుంది.చెమట మీద సెంట్ కొడితే కొన్ని నిమిషాలు మంచి వాసనే వస్తుంది. ఆ తర్వాత వచ్చే కంపును మీరు కూడా భరించలేరు. దుర్వాసనను తగ్గాలంటే కాస్త వదులుగా, చెమటను పీల్చే దుస్తులు వేసుకోండి. నైలాన్, సిల్క్ తో తయారుచేసిన మందపాటి, బిగుతు దుస్తులు వేసుకుంటే చెమట బయటికి పోలేక వాసన వస్తుంది.శరీరానికి ఎంత స్వచ్ఛంగా గాలి తగిలితే దుర్వాసన అంత త్వరగా వీడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: