మైగ్రెయిన్‌ అనేది తరచు వచ్చే తలనొప్పికి భిన్నంగా  తలలో ఒక పక్క భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. అందుకే దీనిని పార్శ్వపు నొప్పి అని, ఆయుర్వేదంలో అర్ధావభేదం అని అంటారు. మైగ్రేన్ నొప్పి సాధారణంగా మెదడుకు సంబంధించిన రక్తనాళాలు సన్నబడి పోవడం, మెదడులోని సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో కలిగే భిన్న మార్పువల్ల ఈ నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ వ్యాధితో ప్రాణహానీ ఉండకపోయినా తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో బాధితుల రోజువారి పనులు చేసుకోవడం కష్టతరమవుతుంది. దీంతో తీవ్ర నిరాశకు గురి అవుతారు. వికారం,వాంతులు, తల తిరుగుడు, వెలుతురు చూడలేకపోవడం ఇవన్నీ మైగ్రెయిన్‌ లక్షణాలుగా చెప్పవచ్చు.మన నిత్య జీవన విధానం లో ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మైగ్రెయిన్‌ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

మైగ్రెయిన్‌తో బాధపడేవారికి అల్లం చక్కటి పరిష్కార మార్గం.  ప్రతిరోజు అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపిగానీ, టీ లో అల్లం కలిపిగానీ తీసుకోవడం వల్ల మైగ్రెయిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది.

ప్రతిరోజు బాదం పప్పు ని నానబెట్టి ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.  మెగ్నీషియం మైగ్రెయిన్‌ తలనొప్పుల్ని నివారించడంతో పాటు,భవిష్యతలో అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

రక్తప్రసరణన వ్యవస్థను మెరుగుపరచడంలో పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రోజూ పుదీనాను ఎక్కువగా ఆహారంలో వాడడం లేదా పుదీనా టీ, తాగడం వల్ల ఇటు మైగ్రెయిన్ బారిన పడకుండా ఉండడంతో పాటు అటు ఆరోగ్యాన్నీ పెంపొందించుకోవచ్చు.

మైగ్రెయిన్ తరచూ రావడానికి మానసిక ప్రశాంతత లేకపోవడం,లైట్, సౌండ్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ అంటున్నారు వైద్యులు.దీన్నుంచి విముక్తి పొందాలంటే రోజువారీ వ్యాయామాలు తప్పనిసరి.వ్యాయామం మనలోని ఒత్తిళ్లను తగ్గించి హాయిగా నిద్రపట్టేందుకు కూడా దోహదం చేస్తుంది.

 విటమిన్ సి అధికంగా ఉన్న ఆపిల్, స్ట్రాబెరీ చెర్రీ, ఆరెంజ్ వంటి పండ్లలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మైగ్రెయిన్ నొప్పులకు వ్యతిరేకంగా పోరాడతాయి.కావున మన నిత్య ఆహారంలో పండ్లను ఆహారంగా చేర్చుకోవడం ఉత్తమం.

సాధారణంగా మనకు 8 గంటల నిద్ర అవసరం అలాకాకుండా రాత్రులు ఎక్కువగా మేలుకొని కంప్యూటర్ , మొబైల్స్ ని ఎక్కువగా వాడడం వల్ల కూడా మైగ్రెయిన్ బారిన పడే అవకాశాలు చాలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: