ఇది ఒక చర్మ వ్యాధి అని అందరికీ తెలిసిందే.విటిలిగో వ్యాధి వల్ల చర్మం పై తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ తెల్ల మచ్చలు ఏమిటి అనుకుంటున్నారా? మెలనోసైట్స్ లో లోపాలు జరగటం వల్ల అవి దెబ్బతిని చర్మం పై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. అంటే ఏ ప్రదేశం లో మెలనిన్ తయారీ అవ్వదో అక్కడ తెల్లటి మచ్చలుగా మిగిలిపోతాయి. చర్మంలో ఉండే మెలనిన్ కణాలు దెబ్బతిన్నాయి అంటే అవి మృతిచెందడం కానీ, చర్మానికి హాని జరగడం వల్ల కాని జరుగుతుంది. అటువంటి తెల్లటి మచ్చలు విటిలిగో వల్ల కానీ వల్ల కానీ ఏర్పడతాయి. అంటే చర్మంపై కొన్ని ప్రదేశాలలో పిగ్మెంట్ ఏర్పడడం జరగదు. విటిలిగో శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు, కానీ మాత్రం కొన్ని ప్రదేశాలలో మాత్రమే వస్తుంది.


ఈ మచ్చలు తెల్లగా ఉంటాయి కాబట్టి తెల్లమచ్చలు అని అంటాము. కానీ కొందరిలో తెలుపుతో పాటు ఎరుపు కలిపి ఉండవచ్చు. సమస్య తీవ్రత పెరిగితే మచ్చలు తెల్లగా మారుతూ ఉంటాయి.ఈ సమస్య జెనిటిక్ ద్వారా వస్తుంది, జీన్స్ వల్లే కాకుండా సంపూర్ణ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఒత్తిడి, సున్నితమైన చర్మం వంటివి ఉన్న వాళ్లకు కూడా విటిలిగో సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.


అంతేకాకుండా ఎవరిలో అయితే గ్లూటాతియోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో, వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతారు. గ్లూటాతియోన్ అనేది చాలా ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. దీనివల్ల శరీరంలో ఉండే హెవీ మెటల్స్ నుండి సంరక్షణ జరుగుతుంది.హెవీ మెటల్స్ నే కాదు ఫ్రీ రాడికల్స్ తో కూడా ఇవి పోరాడతాయి. కనుక ఇవి చాలా అవసరం అని చెప్పాలి. ఇవి నిజానికి యాంటీఆక్సిడెంట్స్ మాత్రమే. మన శరీరం నుండి టాక్సిన్స్ ను బయటకు పంపాలంటే గ్లూటాతియోన్ చాలా అవసరం.


కొన్ని వారాల్లోనే ఈ వ్యాధి నుండి విముక్తి పొందాలంటే, ఈ కొత్త థెరపీ ను ప్రయత్నించండి. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోకుండా ఎండలో అరగంట సేపు కూర్చోండి. ఒకవేళ మీ చర్మం వేడిని తట్టుకోలేదు అని అనుకుంటే, చర్మానికి వాడే నూనెలు ఉపయోగించండి. ఇటువంటి థెరపీలతో పాటు చర్మ సౌందర్యానికి మరియు చర్మం యొక్క ఆరోగ్యానికి సంబంధించిన పసుపు, వేపాకు వంటివి ఉపయోగించండి. వాటివల్ల చాలా ఉపయోగాలు పొందే ఆవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: