ప్రస్తుతం కాలానికి అనుగుణంగా జరుగుతున్న మార్పులతో పాటు అలాగే ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్వం మన పెద్దవారు అరటి ఆకులలో అన్నం తినే వారు. అలాగే నేల మీద కూర్చుని తినేవారు. కానీ ప్రస్తుతం  మారుతున్న కాలానికి అనుగుణంగా చేతులతో తినడం మానేశారు, స్పూన్లతో తినడం అలవాటుగా చేసుకున్నారు. అలాగే నేలమీద కూర్చోవడం మానేసి డైనింగ్ టేబుల్ లో తినడం అలవాటు చేసుకున్నారు. అయితే ఆహారాన్ని స్పూన్ తో తింటే మంచిదా లేక చేతితో తింటే మంచిదా? అయితే ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసం ఏమిటి? ఈ విషయం గురించి తెలుసుకుందాం.


ఆహారాన్ని చేయి తాకగానే ఙ్ఞాన‌ నాడుల ద్వారా మెదడు, పొట్టకు సంకేతాలు చేరుతాయి. దీని వల్ల జీర్ణరసాలు, ఎంజైములు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. సాధారణంగా ఆహారాన్ని వండేటప్పుడు నూనెతోపాటు ఇతర పదార్థాలను సమపాళ్లలో వేస్తారు. అయితే స్పూన్ లేదా ఫోర్క్స్‌తో తినడం వల్ల ప్రతిచర్య జరిగి వాటి రుచి దెబ్బతింటుంది.మన చేతులు, కడుపు, పేగులు కొన్ని మంచి బ్యాక్టీరియాలకు నిలయంగా ఉంటాయి. ఇవి వ్యాధుల నుంచి కాపాడతాయి. చేతులతో తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించగలదు.భోజనం కోసం కూర్చునే ముందు మీరు తప్పకుండా సబ్బు, హ్యాండ్‌వాష్‌తో చేతులు శుభ్రంగా కడగాలి.


స్పూన్‌తో అతిగా, వేగంగా తినడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఇది టైప్ -2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
‘క్లినికల్ న్యూట్రిషన్’ పత్రికలో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం. టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో స్పూన్లు లేదా ఫోర్క్‌లతో తినేవారే ఎక్కువగా ఉన్నారని తేలింది.చేతులతో తినడం వల్ల ఆహారం తీసుకొనే ప్రక్రియను నెమ్మదిస్తుందని, టైప్ -2 డయాబెటిస్ రాకుండా నిరోధిస్తుందని ఇప్పటికే నిరూపించబడింది.చేతితో ఆహారం తింటే శరీరానికి ఓ రకమైన వ్యాయామం జరుగుతుంది.వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు చేతిలోని చిన్న చిన్న నరాలు ఉత్తేజితమవుతాయి. పూర్వం ఆహారాన్ని చేతితోనే తీసుకునేవారు. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు పూర్వీకులకు లేవని నిపుణులు పేర్కొంటున్నారు.వీలు కుదిరితే ఆకులో ఆహారం వడ్డించుకుని నేలపై కూర్చుని తినాలని సూచిస్తు్నారు.


నేలమీద కూర్చుని తినేటప్పుడు పొట్టలోని కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల జీర్ణరసాలు సక్రమంగా విడుదలై ఆహారంలో కలవడంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.నేలపై కూర్చోవడం వల్ల తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది పద్ధతి బరువును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ప్లేట్లు, చెంచాలతోనే తినాలనిపిస్తే మాత్రం పంచలోహ పాత్రలు ఎంచుకోవాలని, ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. చెంచాతో తినడం కంటే చేతులతో తినడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అందువల్ల, మీరు ఆహారాన్ని నమలడానికి ఎక్కువ సమయం గడపడపుతారు.చెంచాతో తీసుకొనే ఆహారంతో పోల్చితే  చేతితో తినేప్పుడు తక్కువ ఆహారాన్ని తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: