సాధారణంగా గుండెపోటు అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు,ఆందోళనలు కూడా గుండెపోటుకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలోనే గుండెపోటును తగ్గించగలిగే మంచి ఔషధాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి ప్రొద్దుతిరుగుడు విత్తనాలు. ఈ విత్తనాలు మన చర్మానికి, ఆరోగ్యానికి, కేశాలకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి అని వారు తెలుపుతున్నారు. అయితే ప్రొద్దుతిరుగుడు  విత్తనాలు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..



1. గుండె ఆరోగ్యంగా పనిచేసేలా చేయడం :
ప్రొద్దుతిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు , విటమిన్లు  గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తాయి. అంతేకాకుండా ప్రొద్దుతిరుగుడు  విత్తనాలను నిరంతరం తగిన మోతాదులో తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

2. వాపులు :
పొద్దుతిరుగుడు విత్తనాల లో విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్, ఇతర వృక్ష సంబంధ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండడం వల్ల  వాపులను చాలావరకు నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్న వారికి మంచి జరుగుతుంది.

3. అధిక బరువు :
పొద్దు తిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల, ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే శరీర మెటబాలిజం ను పెంపొదిస్తుంది.

4. జీర్ణ వ్యవస్థ :
జీర్ణ వ్యవస్థ తో బాధపడేవారు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే ప్రయోజనం చేకూరుతుంది. వీటిలో వుండే ఎంజైమ్ లు మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణశక్తిని పెంపొదిస్తాయి.

5. హార్మోన్ల సమతుల్యతకు :
హార్మోన్ల సమస్యలు ఉన్నవారు పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల్యం గా ఉంటాయి. ఇక థైరాయిడ్ గ్రంధి చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ప్రొద్దుతిరుగుడు  విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావలసిన తగిన పోషకాలు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: