వంకాయలను చాలామంది తినడానికి ఇష్టపడరు. అందుకు కారణం కొంతమందికి అలర్జీ లాగా ఏర్పడుతుంది. మరి కొంతమందికి శరీరం దురద పెట్టడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కొంత మంది వంకాయలు తినడానికి ఇష్టపడరు. మరికొంతమంది వంకాయలను మరీ అమితంగా, వారికి ఇష్టం వచ్చిన వంటల రూపంలో తయారుచేసుకుని తింటూ ఉంటారు. వంకాయలలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కొన్ని పొడవుగా, సొరకాయ లాగ  ఉంటే మరికొన్ని గుండ్రంగా ఉంటాయి. ఏది ఎలా ఉన్నా రుచి మాత్రం ఎప్పటికీ మారదు.. వంకాయలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


1. క్యాన్సర్ :
వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథో సయనిన్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. వంకాయలో ఉండే  సోలాసోడైన్, రమ్నోసైల్, గ్లైకోసైడ్స్ అనబడే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. కాబట్టి చాలా వరకు క్యాన్సర్ ను నివారించుకోవచ్చు..

2.  ఎముకల ఆరోగ్యం:
వీటిలో ఉండే ఐరన్, క్యాల్షియం లు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముకలు దృఢం గా మారడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి, అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి.

3.  మెదడు పనితీరు:
వంకాయలో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, పొటాషియంలు మెదడుకు ఆక్సిజన్  సరఫరా ను పెంపొందించడం వల్ల   ఫ్రీరాడికల్స్ నాశనం అవుతాయి. ఎప్పుడైతే ఫ్రీరాడికల్స్ నాశనమవుతాయో అప్పుడు మెదడులోని రక్తనాళాలు వెడల్పుగా మారుతాయి. మెదడుకు రక్త సరఫరా బాగా జరిగి, మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది.

4. అధిక బరువు:
వంకాయలలో సాపోనిన్ అనబడే సమ్మేళనం ఉండడంవల్ల శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం కూడా తక్కువ.

5. హిమోగ్లోబిన్ స్థాయి పెరగడం :
వంకాయలను తినడం వల్ల వీటిలో ఉండే ఐరన్, థయామిన్, నియాసిన్, కాపర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సీ,విటమిన్ బీ 6, విటమిన్ కె పుష్కళంగా లభిస్తాయి.  ఇవన్నీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగడాన్ని ప్రోత్సహిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: