సాధారణంగా ఆఫీసులో బాగా అలసిపోయినప్పుడు, లేదా ఖాళీగా ఉన్నప్పుడు, స్నాక్స్ తినాలి అనిపిస్తుంది. అది కూడా కార్బ్స్ ఎక్కువ ఉన్న స్నాక్స్ మీదకి మనసు పోతుంది. ఈ హై కార్బ్స్ నాకు ఆకలి తీరుస్తాయి కానీ ఆరోగ్యానికి  మాత్రం మేలు చేయవు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకుంటే మీ ఆకలి తీరుతుంది. అలాగే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ గా కూడా ఉంటాయి.ఇవి అరగడానికి కొంత సమయం తీసుకుంటాయి. కాబట్టి మీకు తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేయదు. స్నాక్స్ ని కూడా మీ డైలీ రొటీన్ లో ఒక భాగంగా చేర్చుకుని చూడండి. అయితే ఇలాంటి ప్రోటీన్ ఉన్న స్నాక్స్ తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.



మీల్స్ టైమ్ లో కాకుండా మధ్యలో ఆకలి వేస్తే తినేదాన్నే స్నాక్ అంటాం. సాధారణంగా పొద్దున్న ఏడున్నర ఎనిమిదికంతా బ్రేక్ ఫాస్ట్ చేస్తే పదకొండు దాటిన తరువాత కొంచెం ఆకలిగా అనిపిస్తుంది, కానీ అది భోజనం సమయం కాదు. అలాగే, ఒంటి గంటా రెండింటికి లంచ్ తీసుకుంటే నాలుగున్నరా ఐదింటికి మళ్ళీ ఏదైనా తినాలని అనిపిస్తుంది, అది డిన్నర్ టైమ్ కాదు. ఈ టైమ్స్ లో తినడానికే మనకి స్నాక్స్ కావాలి. ప్రోటీన్ కోసం కేవలం మీల్స్ మీదే ఆధారపడకుండా స్నాక్స్ లో కూడా ప్రోటీన్ రిచ్ ఆపషన్స్ ని ఎంచుకుంటే హెల్దీగా ఉంటారు. ముఖ్యంగా అన్‌హెల్దీ స్నాక్స్ జోలికి వెళ్ళకుండా ఉంటారు.శనగలు చాలా హెల్దీ, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువే. వీటిని నానబెట్టి ఉడికించి టమాటాలు, ఉల్లిపాయ, కీరా కలిపి కొద్దిగా నిమ్మ రసం చల్లి తీసుకోవచ్చు. లేదా, ఒక కప్పు ఉప్పు, మిరియాల పొడి వేసుకుని సలాడ్ లాగా తీసుకోవచ్చు. క్రాకిల్ లా చేసుకుంటే హై ప్రొటీన్ లో షుగర్ స్నాక్ తయారవుతుంది.


 ఆల్మండ్స్ లో ప్రోటీన్ తో పాటు మినరల్స్, విటమిన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మీ శరీరానికి మేలు చేస్తాయి. ఒక ఔన్స్ ఆల్మండ్స్ లో ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.ఆల్మండ్స్ ని రాత్రి నానబెట్టి మరునాడు పొద్దున్న తొక్క తీసేసి తినవచ్చు. లేదా, ఆల్మండ్స్ ని బేక్ చేసి ప్యాన్ లో కొద్దిగా ఉప్పు వేసి రోస్ట్ చేసుకోవచ్చు. వీటిని క్యారమెల్ తో గ్లేజ్ చేసి సాల్టెడ్ క్యారమెల్ ఆల్మండ్స్ తీసుకోవచ్చు.మామూలు పెరుగుతో పోలిస్తే గ్రీక్ యోగర్ట్ లో ప్రొటీన్ ఎక్కువ. ఇది మీ ఆకలిని తీరుస్తుంది, మీకు కావాల్సిన ప్రొటీన్ ని అందజేస్తుంది.ఒక కప్పు యోగర్ట్ ని అలాగే తినేయవచ్చు. లేదా, ఒక లేయర్ గ్రీక్ యోగర్ట్ తీసుకుని ఒక స్పూన్ గ్రనోలా సీడ్స్ కలిపి కొన్ని బెర్రీస్ యాడ్ చేస్తే హై ప్రొటీన్ స్నాక్ తయారయిపోతుంది.
ట్యూనా ఫిష్ రుచి కి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో పైగా ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఒక క్యాన్ ట్యూనా ఫిష్ లో 29 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.ట్యున్నలని సలాడ్ లా తీసుకోవచ్చు, శాండ్విచ్ లా తీసుకోవచ్చు. ట్యూనా ని ముక్కలుగా కట్ చేసి సలాడ్ వెజిటబుల్స్ తో కలిపి ఉప్పు, మిరియాల పొడి, సలాడ్ డ్రెస్సింగ్ కలిపి తినేయవచ్చు. లేదా, బ్రెడ్ మధ్యలో ట్యూన పెట్టి లెట్టూస్, టమాటా, క్యుకుంబర్ కలిపి శాండ్విచ్ చేసుకోవచ్చు.బాడీలో విటమిన్స్, మినరల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ఎగ్స్ తీసుకోవడం అవసరం.


ఇందులో ఇంకా బీ విటమిన్ కంటెంట్ కూడా ఎక్కువే. ఒక హార్డ్ బాయిల్డ్ ఎగ్ లో 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.ఎగ్స్ ని బాయిల్ చేసి హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ ని అలాగే తినేయవచ్చు. బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోదల్చుకుంటే రెండు హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. ఇంకే ఇతర ఆప్షన్స్ లో ఎగ్స్ ని తీసుకున్నా హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ లో ఉన్నన్ని మినరల్స్, విటమిన్స్ అందవు. ఇది వెయిట్ లాస్ కి ఉపయోగపడే హై ప్రొటీన్ స్నాక్.ఇతర పాల పదార్ధాల లాగానే చీజ్ లో కూడా క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ. వీటి వల్ల బాడీకి కాల్షియం కూడా అందుతుంది. ఈ చీజ్ స్లైసులని అలాగే తినేయవచ్చు. లేదా రెండు బ్రెడ్ స్లైసుల మధ్య పెట్టి టోస్ట్ చేసి శాండ్విచ్ లా తీసుకోవచ్చు.యాపిల్స్ లో విటమిన్ సీ, ఇంకా ఫైబర్ ఉంటాయి. పీనట్ బటర్ ఒక టేబుల్ స్పూన్ వరకూ రోజూ తీసుకోవచ్చు, అంత కంటే ఎక్కువైతే మాత్రం ఫ్యాట్ ఎక్కువగా తీసుకున్నట్లే. హై ప్రొటీన్ లో కార్బ్ స్నాక్స్ లో ఇది కూడా ఒకటి. యాపిల్, పీనట్ బటర్ కలిపి పదిహేను గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: