ఎండాకాలం మొదలయింది ఎండ,వేడి నుండి కాపాడుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా వేసవి తాపాన్ని తట్టుకోవడానికి అనేక రకాల ఫ్రూట్స్ తింటూ ఉంటాం. ఇవన్నీ శరీరం  డీహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. వేసవిలో పుచ్చకాయ ఎక్కువగా దొరుకుతుంది. ఇది తినడం వల్ల వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు. దీనికంటే తాటి ముంజలు తినడం వల్ల ఇంకా మంచిది. ఇవి డిహైడ్రేషన్, అలసటను దూరం చేస్తాయి. తాటి ముంజలు తినడానికి రుచిగా ఉండడమే కాకుండా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలతో బాధపడే వారికి తాటి ముంజలు బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా తాటి ముంజలు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.  వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 తాటి ముంజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, వీటితో పాటు బి కాంప్లెక్స్, నియాసిన్, రిబోఫ్లేవిన్, జింక్, పాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయ  సమస్యలను నిర్మూలిస్తాయి. అంతేకాకుండా శరీరంలో  ఉండే విషపదార్థాలను బయటకు పంపుతాయి.

 శరీరంలోని ఉష్ణోగ్రతను  తొలగించడానికి తాటి ముంజలు బాగా సహాయపడతాయి. జీర్ణక్రియ కూడా అక్రమంగా  జరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా భాగ సహాయపడతాయి. వేసవికాలంలో పిల్లలు, పెద్దలు ముంజలను  తీసుకోవడం వల్ల  ఆరోగ్యంగా ఉంటారు.

 తాటి ముంజలు వేసవికాలంలో చర్మంపై వచ్చే దద్దుర్లను, తగ్గిస్తాయి. అంతేకాకుండా కాలిన గాయాలపై తాటి ముంజల గుజ్జును పట్టించడంవల్ల గాయాలు తొందరగా మానిపోతాయి.

 వేసవికాలంలో డీహైడ్రేషన్కు గురికాకుండా తాటి ముంజలు కాపాడతాయి. దాహాన్ని తీరుస్తాయి. అంతేకాకుండా వడదెబ్బ తగిలిన వాళ్ళకి తాటి ముంజల జ్యూస్ ను ఇవ్వడం వల్ల తొందరగా కోలుకుంటారు.

 తాటి ముంజలు తినడం వల్ల బీపీని అదుపులో ఉంటుందని ఆహార నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి తాటి ముంజలు ఉపయోగపడతాయి.

 తాటి ముంజలు క్యాన్సర్ కణాల నిరోధకానికి సహాయపడతాయి. రొమ్ము క్యాన్సర్ కు కారణం అయ్యే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్ నిర్మూలిస్తాయి.

 అజీర్తి, ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళు తాటి ముంజలు తీసుకోవడం మంచిది. అందుకే తాటి ముంజలను తీసుకోండి వేసవి తాపం  నుండి బయటపడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: