వేసవికాలం వస్తోంది.. కాబట్టి ప్రతి ఒక్కరు వేసవి తాపాన్ని తట్టుకోవాలి అంటే కంపల్సరిగా పుచ్చకాయలను తినాల్సిందే.. ఎందుకంటే వీటిలో వుండే నీటి శాతం శరీరానికి అంది, శరీరం వేడికి గురి అవకుండా ఉంటుంది. అంతే కాకుండా శరీరం హైడ్రేటెడ్ గా ఉండడానికి పుచ్చకాయలు ఎంతగానో సహకరిస్తాయి. అయితే పుచ్చకాయలను ఏ టైంలో తినాలో కూడా తెలిసి ఉండాలి అంటున్నారు నిపుణులు. ఒకవేళ తినకూడని సమయంలో తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పుచ్చకాయలను రాత్రిపూట తినకూడదని సిఫార్సు చేయబడింది. రాత్రి ఏడు గంటల తర్వాత పుచ్చకాయలను తింటే మంచిది కాదని అంటున్నారు. ఎందుకంటే పుచ్చకాయ కొద్దిగా ఆమ్లంతో కూడి ఉంటుంది. అందువల్ల రాత్రి పూట తింటే శరీరం క్రమరహితంగా ఉన్నప్పుడు, జీర్ణక్రియ ప్రక్రియ ఆలస్యం కావచ్చు.. కాబట్టి రాత్రిపూట పుచ్చకాయను తినకుండా ఉండడమే మంచిది.


ఇక ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, వీటి గింజలలో ఐరన్, పొటాషియం తో పాటు ఎన్నో రకాల విటమిన్ల తో నిండి ఉంటుంది. పుచ్చకాయ తో పాటు పుచ్చకాయ గింజలు కూడా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పుచ్చకాయ తినడం వల్ల అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గించవచ్చు. అంతేకాకుండా జ్వరం వచ్చినప్పుడు పుచ్చకాయ రసంలో తేనె కలిపి తాగితే శరీరం నీరసం నుంచి బయట పడుతుంది. అంతేకాకుండా మలబద్దక సమస్య కూడా నివారించబడుతుంది.

 ఇక ఈ పుచ్చకాయ గింజలు తినడం వల్ల యవ్వనంగా గా కనిపిస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం కారణంగా చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలు దూరం చేసుకోవచ్చు.. వేడికి కమిలిన చర్మంపై చల్లని పుచ్చకాయ గుజ్జును రాయడం వల్ల తిరిగి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. అంతేకాకుండా పుచ్చకాయ గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా హైపర్టెన్షన్ తగ్గించి, జీవక్రియలు సజావుగా జరగడానికి సహాయపడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: