కరోనా మహమ్మారి కారణంగా  మనమంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో  చాలామంది ఇంటి నుంచే ‘వర్క్ ఫ్రం హోమ్’ చేస్తూ బిజీగా కాలం గడిపేశారు. కరోనా వైరస్ కి భయపడి బయట అడుగుపెట్టడమే మానేశారు. సూర్యుడి నుంచి సహజంగా అందే విటమిన్ డి కి దూరమయ్యారు. ఈ లోపం ప్రజల్లో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. విటమిన్-డి శరీరానికి అందకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవ్వుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు విటమిన్ డి గురించి తెలుసుకోవాలి. అది లోపించడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై తప్పకుండా అవగాహన ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాలి.


 లాక్‌డౌన్ వల్ల ఇళ్లకే పరిమితం కావడం, ఏసీ గదుల్లో కూర్చొని పనిలో మునిగిపోవడం.. తెల్లవారుజామునే నిద్రలేకపోవడం సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలామంది విటమిన్-డి లోపానికి గురవ్వుతున్నారు. మన శరీరంలోని ఎముకలకు అవసరమైన క్యాల్షియంను శోషించుకోవడానికి, కండరాలు బలహీనం కాకుండా రక్షించడానికి విటమిన్‌-D ఉపయోగపడుతుంది. గుండె పనితీరు చురుకుగా ఉండటంలో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తోంది. అధిక రక్తపోటు సమస్యలున్నవారు ‘విటమిన్-డి’పై అశ్రద్ధ చేయకూడదు.శరీరంలో విటమిన్‌-డి లోపం ఏర్పడితే తీవ్రమైన అలసట లేదా నీరసం ఏర్పడుతుంది. జుట్టు రాలడం, నడుము నొప్పి వంటి సమస్యలకు గురవ్వుతారు. విటమిన్-డి లోపం వల్ల కండరాల బలహీనత ఏర్పడుతుంది. తీవ్రమైన డిప్రెషన్‌కు గురవ్వుతారు.



ఎముకల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మెదడు పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. బద్దకం, అలసట, నిరుస్సాహం, కోపం వంటి లక్షణాలు సైతం విటమిన్-డి లోపానికి సంకేతాలు. శరీరానికి తగినంత ‘డి’ విటమిన్ అందినప్పుడే మనం ఉత్సాహంగా ఉండగలం. తరచుగా అనారోగ్యానికి గురవ్వుతున్నా, అలసటగా ఉంటున్నా, మొటిమల దద్దుర్లు తదితర చర్మ సమస్యలు వేదిస్తున్నా వైద్యులను సంప్రదించాలి.
ఈ విటమిన్‌ను సూర్యకాంతి నుంచి సులభంగా పొందవచ్చు. వర్షాకాలం, చలికాలాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల చాలామందిలో ఈ సమస్య ఏర్పడుతుంది. అలాంటి కాలంలో డాక్టర్ సూచనతో ‘విటమిన్-డి’ను తీసుకోవడం ద్వారా సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. ఉదయపు ఎండలో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది.


ప్రతిరోజూ శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే విటమిన్-డి లోపం దరిచేరదు. ఎండలో నడవడం, వ్యాయామం చెయ్యడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అయితే, విటమిన్-డి మోతాదు మించినా సరే ప్రమాదమే.గుడ్డులోని పసుపు సొనలో విటమిన్-డి ఉంటుంది. రోజుకో గుడ్డును పూర్తిగా తీసుకుంటే విటమిన్ డి సమస్య నుంచి బయటపడవచ్చు. ఆర్గాన్‌ మీట్స్‌, నూనెలు, పాలు, ఛీజ్‌, పన్నీర్‌, నెయ్యి, వెన్నలో ‘విటమిన్‌-డి’ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీ ఆహారంలో ఇవన్నీ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. పుట్టగొడుగు లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. తరచుగా వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్-డి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: