కొత్తిమీరను సాదారణంగా వివిధ ఆహార పదార్దాల తయారిలో ఉపయోగిస్తాము. ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి,భాస్వరం,కాల్షియం,ఇనుము, నియాసిన్, సోడియం, కెరోటిన్, మొక్క నుంచి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు ఉంటాయి. అలాగే ఈ కొత్తిమీర ను  ఇంటి పెరట్లో బాల్కనీలో కుండీలలో ఈజీ గా పెంచుకోవచ్చు. అలాంటి కొత్తిమీర కీ కేవలం రుచి పెంచడమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ధనియాలు డయాబెటిస్ బాధితుల్లో చక్కెర స్థాయిల నియంత్రణలో కీలకంగా పనిచేస్తాయి. ‘ది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్’లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం కొత్తిమీర విత్తనాల్లో డయాబెటిస్  ఉత్పత్తి వంటివి కనిపించాయని పరిశోధకులు పేర్కొన్నారు. కొత్తిమీర ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుందని తేలింది. కొత్తిమీర ఆకులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.


 కొత్తిమీర రసంతో కిడ్నీలను సైతం శుభ్రం చేసుకోవచ్చు.కొత్తిమీరను కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. తర్వాత దాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని నీటిలో వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత వాటిని వడకట్టి సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక గ్లాసు చొప్పున కొత్తిమీర రసం తాగితే కిడ్నీలు క్లీన్ అవుతాయి.కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి , విటమిన్ కె,తదితర ప్రొటీన్లు ఉంటాయి.కొత్తిమీరలో కొత్తి మోతాదులో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, థియమిన్, నియాసిన్, కారోటీన్ కూడా ఉంటాయి.కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.


ఆహారం జీర్ణం కావడానికి, కాలేయం పనితీరు మెరుపడటానికి కూడా ఇది తోడ్పడుతుంది.అల్జీమర్స్ చికిత్సలో విటమిన్ కె ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ కొత్తిమీరలో పుష్కలంగా లభిస్తుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ A, యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరిత్తులు, గొంతు క్యాన్సర్ నుంచి కాపాడతాయి.కొత్తిమీరలో యాంటి సెప్టిక్ గుణాలు ఎక్కువ. ఇది నోటి అల్సర్లను తగ్గించేందుకు సాయపడుతుంది.కొత్తిమీర రసాన్ని మజ్జిగలో కలుపుకుని తాగితే ఎముకలు దృఢంగా మారతాయి.రోజూ 2, 3 చెంచాల కొత్తిమీర రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మలబద్దకం దూరం అవుతుంది.కడుపులో మంటతో బాధపడేవారు పెరుగులో కొత్తిమీర కలిపి తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: