మన శరీర అవయవాల్లో పెద్ద అవయవం లివర్. జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనం తీసుకొనే ఆహారంపై ఆరోగ్యం నిర్ణయించబడుతుంది. కొన్ని ఆహార పదార్థాలు లివర్ పై ప్రభావితం చూపిస్తాయి. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జాగ్రత్తలు ఏమిటో లివర్  పై ప్రభావితం చేసే ఆహారాలు ఏమిటో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 చక్కెరతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లగాని, ఎక్కువ  తీపి పదార్థాలు తీసుకోవడం వల్లగాని కాలేయం దెబ్బతింటుంది. ఇక్కడ పదార్థము కాలేయంలో పేరుకుపోయి కొవ్వుగా ఏర్పడుతుంది. ఫలితంగా లివర్ సరిగా పని చేయకుండా పోతుంది.

 లివర్ చెడిపోవడానికి తాజాగా తయారు చేసే ఆహార పదార్థాల్లో రుచిగా  ఉండడానికి మోనో సోడియం,గ్లూటమేట్ పదార్థాన్ని కలుపుతారు. ఇవే లివర్పై ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల లివర్ పనితీరు క్రమంగా తగ్గుతుంది.

 కాలేయం చెడిపోవడానికి ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తాగడం. కూల్ డ్రింక్స్ లో రసాయన  పదార్థాలను ఎక్కువగా కలుపుతారు. వీటివల్ల కాలేయ పనితీరు తగ్గిపోతుంది.

 మనం  తినే ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువ శాతం ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఉప్పు శరీరంలోని ద్రవాల శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వాటిలో ఉండే విషపదార్థాలు కాలేయం మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇప్పుడు ఎంత తగ్గిస్తే అంత మంచిది.

 బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు లివర్  ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరంలో కొవ్వు ఎక్కువ పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్  రావడానికి ఎక్కువ  అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో లివర్ పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం చాలా మంచిది.

 డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో లివర్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడం మంచిది.


 క్యాన్సర్ కు చేసే చికిత్సలో భాగంగా కీమోథెరపీ కారణంగా లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. హెపటైటిస్ ఎ, బి, సి వంటి వ్యాధులు వచ్చినప్పుడు సరైన చికిత్స పొందక పోయినా లివర్ కి హాని కలిగే అవకాశం ఉంది.

 పేగులు ఇన్ఫెక్షన్ గురైనప్పుడు చికిత్స  చేయించుకోకుండా ఆలస్యం చేస్తే లివర్ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే కు మందులు వాడిన కూరగాయలను వాడినా కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: