బాబోయ్ బయట ఎండలు తెగ మండిపోతున్నాయి. బయటకి వెళ్లి తిరగాలంటేనే ఎండకి తలనొప్పి భయంకరంగా వస్తుంది. వడ దెబ్బ కొట్టే ఛాన్స్ ఎక్కువగా వుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఎండా కాలంలో హైడ్రెటెడ్ గా ఉండటం చాలా అవసరం. అయితే ఈ పద్ధతులు పాటించండి...ఒక గ్లాస్ మంచి నీళ్లు తీసుకోవడం మొదలు పెట్టండి. ఇది చాలా మంచి అలవాటు అవుతుంది. ఆల్కహాల్ డ్రింక్ ని కట్టి పెట్టేయండి. వీటి వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఆల్కహాల్ డ్రింక్ కి బదులుగా మీరు గ్లాసు మంచి నీళ్లు తాగండి. లేదు అంటే ఇప్పుడు చెప్పిన టెక్నిక్ ని అనుసరించి ఆ లిక్విడ్స్ ను తీసుకోవడం ఉత్తమం.లెమన్ గ్రాస్ చాలా మంచి పదార్థం. ఇది డిహైడ్రేషన్ అయిపోకుండా ఉంచుతుంది. అంతే కాదండి లెమన్ గ్రాస్ ని మనం అజీర్తి సమస్యలని కూడా తొలగించొచ్చు. ఇది మనల్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఉపయోగ పడుతుంది. అలానే ఇది గత్ ఫంక్షన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది బాడీ కూల్ చేస్తుంది.


ముందుగా కొద్దిగా లెమన్ గ్రాస్ తీసుకోండి దానిని గోరు వెచ్చని నీటిలో వేసి మరిగించండి ఇప్పుడు పూర్తిగా మరిగిన తర్వాత వడకట్టి ఆ నీటిని మీరు తీసుకోండి. దీని వల్ల మీరు హైడ్రేట్ గా ఉండవచ్చు. అలానే కొద్దిగా లెమన్ గ్రాస్ తీసుకుని నానబెట్టి నీరు స్నానం చేస్తున్నప్పుడు గుప్పెడు ఆకుల్ని బకెట్ లో వేసుకుని స్నానం చేయండి. దీని వల్ల కూడా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకోండి. ఇప్పుడు జీలకర్ర ని రాళ్ళ ఉప్పు లో కలిపేసి ఒక రాత్రి పాటు ఉంచేయండి. వీటిలో సరిపడా నీళ్లు కూడా వేయండి. అయితే దీనిని రాత్రంతా మీరు అలానే వదిలేయండి. ఇప్పుడు దాన్ని మొత్తం వడగట్టండి ఇప్పుడు ఆ నీళ్ళను తాగండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే..? మీరు ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండ వచ్చు. అలానే మీరు జీలకర్ర పొడి తయారు చేసుకుని మజ్జిగ లో లేదా పెరుగు లో కలుపుకొని తాగండి. దీని వల్ల మీరు హైడ్రేట్ గా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది. కాబట్టి సింపుల్ టెక్నిక్ ని అనుసరించి ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: