మనలో చాలా మందికి బాంబూ  ఫుడ్స్  గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం బాంబు ఫుడ్ ని  సూపర్ ఫుడ్ అని అంటారు. అంటే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. అయితే బాంబు ప్రస్తుత కాలంలో బాగా పాపులర్ అయింది.  అందుకు కారణం కొవిడ్-19. కరోనా వైరస్ కారణంగా బాంబూకి ప్రపంచమంతటా  చాలా పెద్ద క్రేజ్ వచ్చేసింది. ఒక్కసారి కరోనాకు బాంబుకు మధ్య గల సంబంధం ఏమిటో?  ఎందుకు అంత పాపులారిటీ పెరిగిందో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో గత కొద్ది నెలలుగా ఇంటర్నెట్ లో బాంబు షూట్స్  పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందని,ఇందులో వైరస్ ను హతమార్చే గుణాలు ఎక్కువగా ఉన్నాయని, త్రిపుర రాష్ట్రం ఇమ్యూనిటీని పెంచేందుకు బాంబూతో తయారు చేసిన రెసిపీ లను మనకు పరిచయం చేసింది. అసలు బాంబు షూట్స్  అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం.

బాంబూ...  దీనినే మనవాళ్ళు వెదురు కర్రలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో వీటిని వెదురు కంజిలు అని కూడా పిలుస్తారు.  ఇవి  ఎక్కువగా కొండప్రాంతాల్లో పొడవుగా పెరుగుతాయి. పొడవుగా పెరిగిన వెదురు మొక్కలు పొదలు పొదలు కమ్ముకొని ఉంటాయి. అయితే ఈ మొక్కల కింద చిన్న చిన్న పిలకలుగా  కనిపించేవే బాంబు షూట్స్.  ఇప్పుడు ఇవి  ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఫుడ్స్ గా పిలువబడుతున్నాయి. బాంబూ  షూట్స్  లో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచే లక్షణాలు ఉన్నాయని కొన్ని ప్రపంచ దేశాలు తమ ప్రజలకు చెబుతున్నాయి. మరి కొన్ని దేశాల్లో అయితే ప్రజలను కాపాడేందుకు గాను సోప్స్, శానిటైజర్ లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాయి. ఫలితంగా కరోనా వచ్చిన తర్వాత కనుమరుగైపోయిన బాంబూ ఒక్కసారి గా రేస్ లోకి వచ్చేసింది.

బాంబూ  లో అత్యధిక పోషక విలువలు ఉన్నాయి. ప్రోటీన్లు,విటమిన్లు,ఫాస్ఫరస్,కాపర్, జింక్,మెగ్నీషియం, క్యాల్షియం వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. థయామిన్,రిబోఫ్లేవిన్,నియాసిన్, విటమిన్ బి6 లాంటి  కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఒక బాంబూ షూట్స్ లో  యాంటీబయాటిక్, యాంటీవైరస్, యాంటీ   గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా బాంబూ ఫుడ్స్ వల్ల మన మన శరీరానికి అత్యధికంగా  ప్రోటీన్స్ 1.9 శాతం నుండి 4.65 శాతం వరకులభిస్తాయి. శరీరానికి 27 క్యాలరీల శక్తి కూడా  అందుతుంది.అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించే శక్తి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: