వెన్నునొప్పులు నాలుగు రకాలుగా ఉంటాయని, ఏయే జాగ్రత్తలు తీసుకొంటే అవి తగ్గుతాయో వారు సూచిస్తున్నారు. బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది.న్నునొప్పి వచ్చిన వారికి ఏ పని చేయాలన్నా కష్టమే అవుతుంది. కూర్చోవాలన్నా, వంగాలన్నా బాధ కలుగు తుంది. వెన్ను నొప్పి ఎలా వచ్చినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బాధను తగ్గించుకోవచ్చని ఫిజియోథెరపిస్టులు చెబుతున్నారు. వెన్నునొప్పులు నాలుగు రకాలుగా ఉంటాయని, ఏయే జాగ్రత్తలు తీసుకొంటే అవి తగ్గుతాయో వారు సూచిస్తున్నారు.


చిన్న పిల్లలుగా ఉన్న సమయంలోనే వెన్నుకు ఏదైనా సమస్య వస్తే అది జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ టైమ్‌లో వారికి ఎలాంటి సమస్యా లేకుండా చూడాలి. పిల్లలు స్కూల్ బ్యాగ్‌ను వీపుపై మోస్తున్నప్పుడు అది మరీ కిందికి జారిపోకుండా వీపు  పై భాగంలో (అప్పర్ బ్యాక్) ఉంచేలా చూడాలి. స్కూల్ బ్యాగ్ వీపుపై మోసుకెళ్లకుండా చక్రాలపై రోల్ చేసేది ఉంటే మంచిది.  పిల్లలు స్కూల్లోనూ, పెద్దలు పనులు చేసే ప్రదేశంలో ఒంగిపోయినట్లుగా గాక వెన్నును  నిటారుగా ఉంచేలా కూర్చోవడం వల్ల (ఎర్గానమికల్లీ రైట్ పొజిషన్)  అలవాటు  చేయిస్తే మంచిది. వె
బరువు తగ్గించుకోవడంతో వెన్నుపై పడే భారం తగ్గుతుంది.


పొగాకు నమలడం, ఆల్కహాల్ తాగడం వంటి దురలవాట్ల నుంచి దూరంగా ఉండాలి.

వీలైనంతగా దగ్గరి బంధువులలో వివాహాలను నివారించడమే మంచిది.

కొన్ని మందులు వాడుతున్నప్పుడు ఎముకలపై వాటి ప్రభావాన్ని గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. మందుల బయోకెమికల్ స్వభావం, వాటి హానికరమైన ప్రభావం, రిస్క్ వంటి అంశాలు తెలిసి ఉండే క్వాలిఫైడ్ నిపుణులను సంప్రదించడం మంచిది.

వెన్ను వ్యాయామాలు చేసేటప్పుడు రెండు ఎక్సర్‌సైజుల మధ్య కొంత విశ్రాంతి తీసుకోవాలి. మెడ వ్యాయామాలకు ఈ అవసరం లేదు. ప్రతిరోజూ అల్పాహారానికి ముందు, రాత్రి భోజనానికి ముందు రెండుస్లారు ఈ వ్యాయామాలు చేస్తే వెన్ను, మెడనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

చదునైన నేలపై ముందుగా వెల్లకిలా పడుకోవాలి. కాళ్లు రెండూ పైకి ఎత్తి మోకాలి దగ్గర లంబకోణంలో వంచాలి. నిదానంగా నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ దించుతూ ఉండాలి. ఇలా ఆరుసార్లు చేయాలి. రోజూ ఈ వ్యాయామం చేస్తే నడుము ఎముకలు పటిష్టం అవుతాయి. 

అదే విధంగా కాళ్ళను వంచి అరచేతులను తల కింద ఆనించాలి. ఇప్పుడు పాదాలను కదిలించకుండా మోకాళ్లను మాత్రమే కుడివైపు వంచి నేలకు ఆనించాలి. తరువాత ఎడమవైపు నేలకు ఆనించాలి. ఇలా ఆరుసార్లు చేస్తే వెన్నుతో పాటు నడము కండరాలు కూడా గట్టిపడతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: