వ్యాయామం చెయ్యడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఉదయాన్నే రన్నింగ్ చేసే అలవాటు ఉంటే ఇంకా చాలా మంచిది. రన్నింగ్ చెయ్యడం వలన మన మెదడు తీరు బాగా పని చేసి బాడీ అంతా బాగా హుషారుగా ఉంటుంది. ఇక రన్నింగ్ ఎలా చెయ్యాలి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.కొంత మంది పరిగెత్తేప్పుడు చేతుల్ని అటూ ఇటూ స్వింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సరిగా ఊపిరి తీసుకోలేరు. కొంత మంది వారి చేతుల్ని వారి చాతీ పైకి పెట్టుకుంటారు, ప్రత్యేకించి అలిసిపోయినప్పుడు. మీ చేతులు ఎప్పుడు నడుము లెవెల్ లో ఉండాలి. మీ మోచేతులు మీ పక్కగా ఉండి మీ చేతులు లంబ కోణంలో వంపు తిరగాలి. మీ భుజాల దగ్గర చేతులు రొటేట్ అవ్వాలి. రన్నింగ్ చేసేప్పుడు కామన్ గా పెద్ద పెద్ద స్టెప్స్ తో పరిగెత్తడం, లేదా అండం మీద ల్యాండ్ అవ్వడం చేయడం వల్ల షిన్ స్ప్లింట్స్ బారిన పడే రిస్క్ ఎక్కువవుతుంది. రన్నింగ్ చేసేప్పుడు మీరు ముదుకి ఉరకకుండా చూసుకోండి. ప్రత్యేకించి ఏదైనా వాలుగా ఉన్న ప్రదేశంలో పైనుంచి కిందకి పరిగెడుతున్నప్పుడు ఈ జాగ్రత్త ఇంకా అవసరం. మీ బాడీ కిందే మీ పాదం ఉండాలి.


ఇక అలాగే షూస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.సరైన టైప్ కాని షూస్ వేసుకోవడం వల్ల పరుగెత్తేటప్పుడు పాదాలకి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు పరిష్కారం రన్నింగ్ స్పెషాలిటీ స్టోర్ కి వెళ్ళి షూస్ కొనుక్కోవడం. వారు మీ పాదాల ఆకృతిని బట్టీ మీ రన్నింగ్ స్టైల్ ని బట్టీ షూస్ రికమండ్ చేస్తారు. మీకు సరిపోయే షూ కొనుక్కున్న తరువాత ప్రతి మూడు వందల యాభై మైళ్ళ పరుగుకీ షూస్ మార్చేస్తూ ఉండండి, లేదంటే కుషన్ అరిగిపోవడం వల్ల గాయాలయ్యే రిస్క్ ఉంది. మీ రన్నింగ్ తరువాత వాటిని గాలికి ఆరబెడితే అవి ఎక్కువ కాలం మన్నుతాయి.మరీ స్పీడ్ గా మరీ ఎక్కువ దూరం పరిగెత్తేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావడమే కాక ఒక్కోసారి పూర్తిగా పరుగు అంటేనే విరక్తి వచ్చే ప్రమాదం కూడా ఉంది. వారానికి ఎన్ని సార్లు, ఎంత దూరం, ఎంత స్పీడ్ అని మీరు ఎస్టిమేట్ వేసుకుంటారో దాని కాన్నా తక్కువగానే చేయండి.ఇక ఈ పద్ధతులు పాటించండి. ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: