మనకు సాధారణంగా కోడి గుడ్డు అంటే అందరికీ తెలుసు. ఇందులో రెండు రకాలు..ఒకటి నాటి కోడిగుడ్లు, ఇంకోటి బాయిలర్ కోడి గుడ్డు. ఇందులో మళ్ళీ బ్రౌన్ గుడ్డు,వైట్ గుడ్డు అని రెండు రకాలు ఉంటాయి. ఇంతకీ ఇందులో ఏ గుడ్డు మంచిదని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నిజానికి  అసలు  ఏ గుడ్డు ఆరోగ్యానికి మంచిది. ఎందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అనే విషయాలను ఒకసారి చూద్దాం.


రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలు పరంగా ఉండేటువంటి దానిని ఎంచుకోవడం చాలా కష్టమైపని. తెల్ల గుడ్డు మరియు బ్రౌన్ గుడ్డు ల మధ్య ఎప్పుడూ పెద్ద గందరగోళంగా ఉంటుంది. సాధారణంగా ఆహార పదార్థాలు తెల్లగా ఉండకపోవడమే మంచిదంటారు. కాస్త బ్రౌన్ కలర్ గా ఉన్న వాటిని ఆరోగ్యవంతమైనవని పరిగణిస్తారు. ఇదే కోవలోనే బ్రౌన్ రైస్ వచ్చి చేరింది. అదేవిధంగా బ్రౌన్ బెడ్ కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతుంది.అలాగే గోధుమ రంగు గుడ్డు కూడా మనకు దొరుకుతున్నప్పటికీ ఇది చాలా ఖరీదైనది. అంత త్వరగా మార్కెట్ లో కూడా అందుబాటులో ఉండవు.


అందుకే ఈ గుడ్డు ను ఆరోగ్య కరమైన గుడ్డుగా పరిగణించబడుతోంది . రోజులో ఏ సమయంలోనైనా తినగలిగే ఆహారం ఇది. ఇది శరీరానికి కావల్సిన శక్తిని ఇస్తుంది. గుడ్లు ప్రొటీన్ల  శక్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కండరాలను నిర్మించడానికి, దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి ఇవి అవసరం. గుడ్డులోని పచ్చసొనలో "విటమిన్ డి" అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రోజంతా శక్తిని అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది.


 గోధుమ గుడ్డుకు, తెల్ల గుడ్డుకు మధ్య బేధాలు :

గుడ్డు యొక్క రంగు కోడి యొక్క ఆరోగ్యం మరియు వాతావరణం పై ఆధారపడి ఉంటుంది.

గోధుమ రంగు గుడ్లు పరిమాణంలో చిన్నగా  ఉంటాయి. గుడ్డు యొక్క పచ్చసొన తెలుపు వేరియంట్ కంటే ముదురు రంగులో ఉంటుంది.

క్యాలరీలు విషయానికొస్తే, రెండూ సమానంగా ఉంటాయి. కానీ గుడ్లు మొత్తం కోడి పైన ఆధారపడి ఉంటాయి.


బ్రౌన్ గుడ్లలో ఒమేగా త్రీ  తెల్లటి వాటిలో కంటే కొంచెం ఎక్కువగా సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు రకాల గుడ్లలో  ప్రోటీన్, కొలెస్ట్రాల్  కంటెంట్ సమానంగా ఉంటుంది.


ఇవి రెండూ ఒకే రకమైన రుచిని కలిగి ఉంటాయి. కానీ తెలుపు రంగు తో పోలిస్తే గోధుమ రంగు గుడ్లు  మంచివి . కానీ ఈ రెండు గుడ్ల మధ్య పోషకాలలో ఎటువంటి తేడా లేదు. కానీ బ్రౌన్ వేరియంట్స్ ని ప్రయత్నిస్తేనే మంచిదంటున్నారు నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: