ప‌ట్ట‌ణాల్లో కాకుండా గ్రామాల్లో ఫ్రీగా దొరికే పండు నేరేడు పండు. ఫ్రీగా దొరుకుతుంద‌ని చీప్ గా చూస్తారేమోగానీ ఈ పండులో పోష‌కాలు మెండు. నేరేడుపండు వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో పోషకాలు దొరుకుతాయి. నిజానికి నేరేడుపండు పై రామాయ‌ణంలో సైతం ప్ర‌స్తావ‌న వ‌స్తుంది. రాముడు త‌న వ‌న‌వాసంలో నేరేడు పండ్ల‌నే తిన్నాడ‌ని రామ‌య‌ణంలో ఉంటుంది. అందువ‌ల్లే ఈ పండును ఫ్రూట్ ఆఫ్ గాడ్ అనికూడా పిలుస్తారు. కొంచెం తీపిగా కొంచెం పుల్ల‌గా ఉండే  ఈ పండుతో ఆరోగ్యానికి ఎలాంటి మేలు జ‌రుగుతుందో ఇప్పుడు చూద్దాం.
 
కాలేయంలో బైల్ జ్యూస్ ఉత్ప‌త్తి త‌గ్గిన‌ప్పుడు క‌ల్లు శ‌రీరం ప‌సుపు రంగులోకి మారుతాయి. అయితే నేరేడుపండు లో ఉండే ఆంథోసైనిన్ అనే ప‌ధార్థం ఆ ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. సూర్యుడి వేడిని త‌ట్ట‌కోవడానికి నేరేడు పండ్లు ప్ర‌భావవంతంగా ప‌నిచేస్తాయి. నేరేడు పండ్ల‌లో ఉండే జాంబోలిన్ మ‌రియు జాంబోసిన్ అనే స‌మ్మేళ‌నాలు రక్తంలో షుగ‌ర్ చేర‌కుండా అడ్డుకుంటాయి. దాంతో ర‌క్తంలోకి చెక్కెర ప్ర‌వాహం త‌గ్గించి ఇన్స్యులిన్ ఉత్ప‌త్తిని పెంచుతాయి. మూత్ర స‌మ‌స్య‌లు ఉంటే దూర‌మ‌వుతాయి. కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య ఉన్న‌వారు ఈ పండ్ల‌ను తిన‌టం వ‌ల్ల రాళ్ల స‌మ‌స్య త‌గ్గే అవ‌కాశం ఉంది. నేరేడు పండ్లు క‌డుపులో అల్స‌ర్ల‌ను త‌గ్గిస్తాయి. అంతే కాకుండా నోటిపూత ఉన్న‌వారు కూడా నేరేడుపండ్ల‌ను తినడం ద్వారా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నేరేడు జ్యూస్ ను ర‌క్త స్రావ నివారిణిగా మ‌రియు మౌత్ వాష్ గా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ పండ్లు తిన‌డం ద్వారా నోటి దుర్వాస‌న స‌మ‌స్య త‌గ్గిపోతుంది. అంతే కాకుండా చిగుళ్ల స‌మ‌స్య‌లు ఉంటే దూర‌మ‌వుతాయి. ఎర్ర రక్తక‌ణాలు వృద్ధి చెంద‌డంలోనూ నేరేడు పండ్లు ఉప‌యోగ‌ప‌డుతాయ‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. జిగ‌ట విరేచ‌నాల‌తో బాధ‌ప‌డేవారు రోజుకు రెండు నుండి మూడు చెంచాల నేరేడు పండ్ల‌ర‌సాన్ని తాగాలి. ఈ పండులో అధిక ఫైబ‌ర్ ఉండ‌టం వ‌ల్ల జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. అంతే కాకుండా వికారం వాంతిని ఈపండ్లు నివారిస్తాయి. నేరేడుపండ్ల‌లో ఉండే విట‌మిన్లు పోష‌కాలు శ‌రీరానికి కాంతిని అందిస్తాయి. దాంతో చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: