కరోనా ప్రపంచవ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపించి, దేశాల ప్రజలందరినీ ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ వైరస్ నివారణ కు శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు.. ఇక ఇప్పటికే పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ,  కరోనా మాత్రం తన పని తాను చేసుకుంటూనే  ఉంది. ఇప్పటివరకు కరోనా వైరస్ కొంతవరకు తగ్గిందని అనుకునేలోపే, సెకండ్ వేవ్ కరోనా వచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది . ఇంతకుముందు కరోనాకు అయితే కొన్ని లక్షణాలు బయటపడేవి. కానీ ఇప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండా ప్రజల పై తన పంజా విసిరి, అమాయకులను ఎంతోమందిని తనతో పాటు తీసుకువెళుతుంది..


ఇక ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇప్పుడున్న టీకాలు కు తోడుగా, మరొక మందును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.. ఇప్పటివరకు ఇంగ్లీష్ మెడిసిన్స్ పై ఆధారపడి ఉన్న మనల్ని, మరొక మార్గంలో తీసుకెళ్లేందుకు ఆయుర్వేదశాస్త్రం పై దృష్టి సారించారు శాస్త్రవేత్తలు. ఎక్కువగా పొలం గట్ల వద్ద పెరిగే ఓ మొక్క పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.  ఆ మొక్క పేరు అడ్డసరం.. కరోనా వైరస్ పై ఈ మొక్క ఏ మేరకు పనిచేస్తుంది అనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లైడ్ డెవలప్మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వంటి జాతీయ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి.. అయితే ఈ మొక్క సానుకూల ఫలితాలను ఇవ్వడంతో అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది..


కరోనా వైరస్ బారిన పడిన రోగులలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం,  రక్తం గడ్డ కట్టడం, ఊపిరితిత్తుల్లోని కణజాలాలు దెబ్బతినడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటివి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మూడు వ్యవస్థలను మెరుగుపరచడానికి అడ్డసరం మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది అని పరిశోధనలో తేలింది. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడే జన్యువులకు సహాయపడే గుణాలు అడ్డసరం లో ఉన్నాయని ఒక అధ్యయనం కనుగొన్నది..


ఈ అడ్డసరం మొక్క యొక్క ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును మందుల తయారీలో విరివిగా వాడుతుంటారు.  రక్తస్రావం నివారణ, చర్మ వ్యాధుల చికిత్సలో కూడా వినియోగిస్తున్నారు.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ అడ్డసరం పై పరిశోధనలు చేసి కరోనా ను అరికట్టే సామర్థ్యం ఈ మొక్కకు ఉన్నట్టు పరిశోధనలో తేల్చారు..


మరింత సమాచారం తెలుసుకోండి: