కేవలం ముఖం అందంగా ఉంటే సరిపోదు, ఆరోగ్యం కూడా ఉండాలి. అప్పుడే మనిషి అందంగా ,ఆరోగ్యంగా కనిపిస్తాడు. ప్రస్తుతం వేసవి కాలం మొదలైన సందర్భంగా ఎక్కువ మంది డీహైడ్రేషన్ కు గురి అవుతూ, ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు .  అయితే వీటన్నింటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలి అంటే , చెరకు రసం అన్నిటికన్నా మేలు అని అంటున్నారు సౌందర్య నిపుణులు తో పాటు ఆరోగ్య నిపుణులు కూడా.. ఈ చెరుకు రసం మనకు ఎలా ప్రయోజనాన్ని చేకూరుస్తుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


ఆరోగ్య విషయానికొస్తే, చెరుకు రసానికి  కాసింత అల్లం, నిమ్మరసం తగిలించి ,తాజా చెరకు రసం తాగితే అలసట ,నీరసం ఇట్టే మాయమైపోతాయి. అంతేకాకుండా శరీరానికి కావలసిన శక్తిని అందించిన వారతారు.. ఇక అంతే కాకుండా మూడీ గా ఉన్నప్పుడు కూడా కాసింత చెరుకురసం గొంతులో పెడితే చాలు ,అలసట ,నీరసం , మూడీ గా ఉండడం అన్ని ఇట్టే పోతాయి.

ఇక అందం విషయానికొస్తే, చెరకు రసంలో కొద్దిగా ముల్తాని మట్టిని కలిపి ,పేస్టులా చేసుకుని ముఖానికి పట్టిస్తే ,చర్మం పై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. ఇక అంతే కాకుండా ఇందులో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మ కణాలను పునరుజ్జీవింప చేస్తాయి.

చెరుకు రసానికి కొద్దిగా కాఫీ పొడిని చేర్చి, స్క్రబ్ లా  ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.. నిమ్మరసం ,ఆపిల్ జ్యూస్, ద్రాక్ష రసం, కొబ్బరి పాలు ,చెరకు రసాలను సమపాళ్ళలో కలిపి చర్మానికి పట్టించాలి.  ఇలా చేయడం వల్ల వీటిలో ఉండే లాక్టిక్ ,మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు చర్మంపై మొటిమలను ,మచ్చలను తొలగించి చర్మం నిగ నిగలాడే లాగా చేస్తాయి.

ఇక బొప్పాయి గుజ్జులో కొద్దిగా చెరుకు రసం కలిపి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది . ముడతలు కూడా తగ్గి పోవడానికి వీలుగా ఉంటుంది.

ఇక లీటర్ నీటిలో, గుప్పెడు పుదీనా ఆకులు, పావు లీటర్ చెరుకు రసం కలిపి మరిగించి, ఆవిరి పట్టుకుంటే చర్మం తేటగా తయారవుతుంది.. అలాగే ప్రతిరోజూ పడుకునేముందు కేవలం చెరుకు రసాన్ని మాత్రమే , ప్రతిరోజు ముఖానికి పట్టించుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: