నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. అసలు సరిగ్గా మనిషి నిద్రపోకపోతే ఖచ్చితంగా తక్కువ టైంలోనే చనిపోవడం ఖాయం. నిద్ర లేమి వలన చాలా రోగాలు వస్తాయి. కాబట్టి నిద్రపోవడం చాలా ముఖ్యం. కాని ఈ రోజుల్లో ప్రశాంతమైన నిద్ర కొంతమందికే వస్తుంది. కాబట్టి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించండి. ప్రశాంతమైన నిద్ర మీ సొంత అవుతుంది.నిద్ర పట్టాలంటే ముందుగా చెయ్యాలసిన కష్టమైన పని. స్మార్ట్ ఫోన్ ని దూరంగా పెట్టడం. అవును స్మార్ట్ ఫోన్ వల్లే చాలా మంది నిద్ర లేమి సమస్యకి గురవుతున్నారు.స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం మానేస్తే మంచి నిద్ర పడుతుంది. స్మార్ట్ ఫోన్ వల్ల కలిగే బ్లూ లైట్ అదే విధంగా టీవీ, కంప్యూటర్ ద్వారా వచ్చే లైట్ ఎఫెక్ట్ అవుతుంది.


దీంతో నిద్ర పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని గమనించాలి. చీకటిగా ఉండే గది లో నిద్రపోవడం లాంటివి ప్రయత్నం చేయొచ్చు. లేదా మీరు స్లీప్ మాస్క్ ని ఉపయోగించి నిద్ర పోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా పూర్తిగా నిద్రపోవడానికి వీలవుతుంది.అదే విధంగా ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోండి. అలానే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. దీనితో మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు మరియు మీరు ఆరోగ్యంగా ఉండడానికి కుదురుతుంది.


పెద్దవాళ్లు రోజుకి కనీసం ఏడు గంటలు లేదా అంత కంటే ఎక్కువసేపు నిద్ర పోయినా మంచిదే. అదే యువత 8 నుండి 10 గంటల పాటు నిద్రపోవాలి. అలాగే చిన్నారుల అయితే 14 గంటల వరకు నిద్ర పోవచ్చు. ఇలా పాటిస్తే మంచిగా, ఆరోగ్యంగా ఉండచ్చు.6 గంటల పైగా నిద్రపోయే వారిలో ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెళ్లడయింది. కాబట్టి ఈ పద్ధతులు పాటించండి. మంచి ప్రశాంతమైన నిద్రని సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: