ఈ మధ్య కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.. కళ్లు మూసి తెరిచే లోగా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అలాగే మరణాల రేటు కూడా పెరుగుతుంది. ఊహించని పరిణామం అని చెప్పాలి.కరోనా వ్యాధిని నివారించడానికి ప్రజలు అనేక పద్దతులను ఆశ్రయిస్తున్నారు. నిపుణులు, వైద్యులు కూడా కరోనా నుంచి బయటపడాలంటే గృహ వస్తువులను వాడుకోవాలని సలహా ఇస్తున్నారు.  ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. వాటిలో కొన్ని మంచి ఫలితాలను ఇస్తే మరి కొన్ని మాత్రం ప్రాణాల మీదకు తెస్తున్నాయి..


అయిన వారి పిచ్చిని మాత్రం పక్కన పెట్టలేదు.. ఇప్పుడు వంటింట్లో దొరికే వెల్లుల్లి తో కరోనా రాదనే వార్త వినిపిస్తుంది.. మరి వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎంటో ఒకసారి చూద్దాం..

.కరోనా కాలంలో చాలా మందికి గొంతు నొప్పి ఉంటుంది. మీకు కూడా ఈ సమస్య ఉంటే ఒక గ్లాసు వేడి నీటిలో కొన్ని చుక్కల వెల్లుల్లి రసం కలపండి. ఈ నీటితో గార్లింగ్ చేయండి ఉపశమనం లభిస్తుంది..

ఇప్పుడు అందరికీ మొటిమల సమస్య బాధిస్తుంది.. అయితే,నుంచి 6 టీస్పూన్ల వెల్లుల్లి రసం తీసుకొని దూది సహాయంతో ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి.. మీకు ఉపశమనం లభిస్తుంది.

.జుట్టు రాలిపోవడం లేదా, చుండ్రు ఎక్కువగా ఉన్నాకూడా వెల్లుల్లి మంచి మెడిసిన్.. 2 టీస్పూన్ల వెల్లుల్లి రసం తీసుకోండి కొన్ని చుక్కల ఆవ నూనె వేసి మీ జుట్టు మూలాలపై రాయండి. ఇది జుట్టు రాలడం, చుండ్రు సమస్య పోయి.. జుట్టు ఒత్తుగా తయారవుతుంది..


వెల్లుల్లి ను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే అధిక కొవ్వు తగ్గిపోతుంది.. శరీరం నాజూకుగా తయారవుతుంది.. ఉబ్బసం ఉంటే మీరు వెల్లుల్లి రసం ఉపయోగించాలి. ఇది మీకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు వెల్లుల్లి కూడా తినవచ్చు. ఉబ్బసం రోగులకు ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసం కలిపి తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

దగ్గు ఎక్కువగా ఉంటే వారికి వెల్లుల్లి బాగా ఉపయోగ పడుతుంది.. ఒక గ్లాస్ దానిమ్మ రసం లో మూడు చుక్కల వెల్లుల్లి వేసుకొని తాగితే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది..


చూసారుగా వంట గదిలో ఉండే ఈ ఘాటైన వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: