కరోనా వైరస్ ప్రభావం తో ప్రతి ఒక్కరి జీవన స్థితిలో మార్పులు సంభవించాయి. అంతేకాకుండా రోగనిరోధకశక్తిని పెంపొందించే పదార్ధాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాంటివాటిలో డ్రైఫ్రూట్స్, నట్స్ చాలా ముఖ్యమైనవి. ఇందులోనే అతిముఖ్యమైనది జీడిపప్పు. దీని విలువ కాస్త ఎక్కువ అయినప్పటికీ దీని వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

జీడిపప్పు మంచి రుచి మాత్రమే కాదు.. దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీడిపప్పును మనం అనేక వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్, జింక్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వు లతోపాటు యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా జీడిపప్పులో చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. ఎంత తక్కువ అంటే రాగుల తో సమానంగా ఉంటుంది. అయితే ఈ జీడిపప్పు వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో చూద్దాం.


1).కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది:
అధిక స్థాయిలో కొలెస్ట్రాల్ ఉండటం వల్ల గుండె సమస్యలకు దారితీస్తుంది. జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

2). బరువు తగ్గటం:
జీడిపప్పులో ఒమేగా 3 పుష్కలంగా లభిస్తుంది. తద్వారా శరీర జీవక్రియను మెరుగుపరుస్తుంది. అప్పుడు బరువు తగ్గడానికి, అదనపు కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది.

3). కళ్ళకు మంచిది:
జీడిపప్పులో  రెటీనాను రక్షించే లూటిన్ అనే పదార్థం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల uv కిరణాల నుండి కళ్ళను రక్షించడం లో ఏంతో సహాయ పడుతుంది .

4). మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
ఇతర గింజలతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి .మధుమేహం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా నిత్యం ఆరోగ్యంగా ఉండేలా  ఈ జీడిపప్పులు చక్కగా పనిచేస్తాయి.


చూశారు కదా..! కాబట్టి ప్రతిరోజూ తగిన మోతాదులో ఈ జీడి పప్పులు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: