ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తుంది.రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వుంది.ఇక కరోనా మహమ్మారి ఇన్‌ఫెక్షన్‌లో జలుబు, జ్వరం, దగ్గుతో పాటు ఆయాసం కూడా లక్షణాలుగా ఉండటంతో ఆస్తమా పేషెంట్లు భయపడుతున్నారు. కొంచెం ఆయాసంగా అనిపించగానే కరోనా సోకిందేమోనని ఖంగారు పడుతున్నారు. వాతావరణాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితులు మారిపోయే ఆస్తమా బాధితులు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆస్తమా ఉన్నవాళ్లకు కరోనా సోకితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇటువంటి టైంలో ఆస్తమా బాధితులు తప్పకుండా సామాజిక దూరం పాటించాలి. ఇంట్లో తగినంత వెచ్చదనం ఉండేలా చూసుకోవాలి. దుమ్ము, ధూళి, కాలుష్యాలకు దూరంగా ఉండాలి. కాసేపు నడవటం, ఈత కొట్టడం, యోగా, శ్వాస సంబంధ వ్యాయామాలు వంటివి చేస్తూ ఉండాలి.


ఏమాత్రం పరిస్థితి సీరియస్ అనిపించిన కాని వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఇన్‌హేలర్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. చల్లని పదార్థాలకు, చల్లని వాతావరణానికి చాలా దూరంగా ఉండటం మంచిది. అలాగే ఒకరి ఇన్‌హేలర్‌ మరొకరు అస్సలు ఉపయోగించకూడదు. ఆస్తమా బాధితులు ఈ ప్రాథమిక జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.ఆస్తమా రోగులు వాడే ఇన్‌హేలర్స్‌ రెండు రకాలు ఉంటాయి. డ్రైపౌడర్‌ ఇన్‌హేలర్స్‌, మీటర్‌ డోస్‌ ఇన్‌హేలర్స్‌. వీటిల్లో మీటర్‌ డోస్‌ ఇన్‌హేలర్స్‌ వాడేటపుడు తప్పని సరిగా స్పేసర్‌ను ఉపయోగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నెబులైజర్స్‌ వాడటం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. అందువల్ల అవసమైతే తప్ప నెబులైజర్స్‌ జోలికి పోకూడదు. పీల్చే మందులు వాడినా పరిస్థితి మెరుగుపడకపోతే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. వీటితో పాటు ఎప్పటి కప్పుడు డాక్టర్ల సలహా తీసుకుంటూ జాగ్రత్తలు పాటించాలి.బయటకి వెళ్ళేటప్పుడు తప్పకుండా మాస్కు పెట్టుకోవాలి. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి.లేకపోతే చాలా ప్రమాదకరం. కాబట్టి సురక్షితంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: