దేశంలో కరోనా విజృంభిస్తుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు 2 వేలకు చేరాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేష్ తోపే వెల్లడించారు. కరోనా కేసులు ఎక్కువయ్యే కొద్దీ బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు అటాచ్ చేసిన హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అందించాలని ఆదేశించినట్టు హెల్త్ మినిస్టర్ పేర్కొన్నారు. అంతే కాకుండా బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 50 శాతం మరణాల రేటు ఉన్నట్టు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన బాధితులకు ఈఎన్టీ , న్యూరాలాజిస్ట్ లు  చికిత్స అందించాలని తెలిపారు. బాధితులకు ఉచితంగా వైద్యం అందించేలా కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. బ్లాక్ ఫంగల్ చికిత్స కోసం వాడే మందుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించేందుకు ప్రెస్సింగ్ అథారిటీ కి లేఖ రాసామని చెప్పారు. 

ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఒక్కరోజే 60 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా బ్లాక్ ఫంగస్ బారిన పడి ఆరుగురు మృతి చెందారు. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులపై కర్ణాటక కూడా అలర్ట్ అయ్యింది. గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఫంగస్ బారిన పడ్డ వారిలో ముందుగా కంటి చూపు కోల్పోతున్నారు. అంతే కాకుండా చివరికి బ్రెయిన్ డెడ్ కు దారితీస్తోంది. అయితే రోగనిరోధక శక్తి కోసం స్టెరాయిడ్స్ వాడుతున్నవారు..బలహీనమైన రోగ నిరోధక శక్తి కలిగిన వారే బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇది మనుషుల్లో అరుదుగా కనిపిస్తుందని కరోనా నుండి కోలుకున్న రెండు మూడు రోజుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తాయని చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: