ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్ తో మొత్తం అతలాకుతలమవుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థ కూడా దిగజారిపోయింది. ప్రతిరోజు కరోనా మరణాలు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వైరస్ కూడా పుట్టుకొచ్చింది. ఆ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే, పలు రకాలుగా వ్యాప్తి చెందుతుంది అని కొంతమంది చెబుతున్నారు. అది ఎలానో ఒకసారి తెలుసుకుందాం.

ఆక్సిజన్ అందించేటప్పుడు స్టెరైల్ నీటికి బదులు సాధారణ నీటిని హ్యూమిడి ఫయర్ (తేమను అందించే పరికరం) ద్వారా అందించడం కూడా బ్లాక్ ఫంగస్ కు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై అహ్మదాబాద్ కి చెందిన సీనియర్ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్ అతుల్ అభ్యంకర్ మాట్లాడుతూ... బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణం.. ఆక్సిజన్ కోసం ఉపయోగించే హ్యూమిడి ఫయర్ లే.ఈ హ్యూమిడి ఫయర్ లో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు, ఇలా వీరందరూ సాధారణ నీటిని వాడేస్తున్నారు. అందులో రకరకాలైన సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటి కారణంగా శరీరంలో ఫంగస్ ఏర్పడుతోంది" . అంటూ చెప్పుకొచ్చారు.

సాధారణంగా  నీటిని 24 గంటల్లో రెండు సార్లు మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యుమిడి ఫయర్ ను శుభ్రం చేయాలి. అని సూచించారు. కోవిడ్ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇస్తున్న వారు, వాటి దుష్ప్రభావాల కారణంగా కోవిడ్ దాడి చేస్తుంది. కళ్ళు, ముక్కు,మెదడు, పళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కళ్ళకింద వాపులు, ముక్కు, కళ్ళు ఎర్రబడి పోవడం, చిగుళ్లు కుళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కరోనా వైరస్ ఏ భాగంలో అయితే చేరి ఉంటుందో, ఆ భాగాన్ని ఈ బ్లాక్ ఫంగస్ పూర్తిగా తినేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ అదుపులో లేని వారికి ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతుంది. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా గుజరాత్ లో కొందరు ఆవుపేడను, మూత్రాన్ని శరీరానికి పూసుకుంటారు. ఇలా చేయకూడదని,ఈ విధంగా న్యూ కరోనా వైరస్ ను, ఇతర ఫంగస్ ఇన్ఫెక్షన్లు  దాడి చేస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: