కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారిపోతున్నాయి. మనుషుల్లో అనేక మార్పులు వస్తున్నాయి. తినే ఆహారాలలో కూడా తేడా వస్తుంది. ఒకప్పుడు ఒక్కసారి కడుపునిండా తిన్న కాని సాయంత్రం దాకా ఆకలికి తట్టుకునేవారు ఇప్పుడలా కాదు. రాను రాను మనుషుల సామర్ధ్యం కూడా తగ్గిపోతుంది. ఇక తాజాగా తేలిందేంటంటే క్రమ క్రమంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం కూడా తగ్గిపోతుందట. అంటే వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందట.వందకి పది మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఉండవలసిన దానికంటే తక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా గర్భధారణ కావాలి అంటే ఒక మిల్లీ లీటరుకు 15 నుంచి 30 మిలియన్ల కణాలు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందని నిర్దారణకు రావచ్చు.


ఇక  ప్రముఖ ఎపిడమాలజిస్ట్, అవార్డ్ విన్నింగ్ శాస్త్రవేత్త షన్నా హెచ్ స్వాన్ రాసిన కౌంట్‌డౌన్’ అనే పుస్తకంలో వీర్యకణాల గురించి షాకింగ్ విషయాలు పొందుపరిచారు. ‘కౌంట్‌డౌన్’లో చెప్పిన కొన్ని విషయాలు పురుషుల్లో పిల్లలు పుట్టించగలిగే సామర్థ్యంపైనే డౌట్స్ పెంచుతున్నాయి.ఇప్పటికే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య దారుణంగా పడిపోయినట్లు షన్నా హెచ్. స్వాన్ తన పుస్తకంలో రాశారు. మరో 40 ఏళ్లలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోయే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. 2060 నాటికీ గర్భానికి అవసరమయ్యే కణాలు మెజారిటీ పురుషుల్లో ఉండవని ఆమె తేల్చి చెప్పారు.


ఇది ఒక్క మానవ జాతిలోనే కాదు అన్ని జంతువుల్లో ఇదే పరిస్థితి ఉందని ఆమె తెలిపారు.2045 నాటికి సంతానోత్పత్తి కోసం చాలా జంటలు సహజ శృంగార ప్రక్రియకు బదులు ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని  చెప్పుకొచ్చారు.కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. అలాగే వ్యాయామం చెయ్యాలి. ఇక సరైన సమయానికి నిద్రపోవాలి.ఇంకా బాదం పప్పు ఎక్కువగా తింటూ ఉండాలి. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే వీర్యకణాల సంఖ్య పెరిగే అవకాశం వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: